Modi : మోడీ నా 15వ కొడుకు.. 25 ఎకరాలు రాసిస్తా.. వందేళ్ల బామ్మ స్టేట్ మెంట్..!
Modi : నరేంద్ర మోడీ హవా నార్త్ లో బాగానే కనిపిస్తోంది. మోడీకి చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారండోయ్. ఇప్పుడు ఏకంగా ఓ వందేళ్ల బామ్మ కూడా మోడీ మీద తనకున్న ప్రేమను చూపించేసింది. ఇంతకు ముందు కూడా చాలా మంది ఇలాగే మోడీ మీద ఉన్న ప్రేమను బయట పెట్టేశారు. ఇప్పుడు ఈ బామ్మ వంతు వచ్చింది కాబోలు. అయితే ఆ బామ్మ వయసు కూడా వందేళ్లు దాటిపోయిందండోయ్. అందుకే ఆమె చేసిన కామెంట్లు కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. ఇందులో ఆ బామ్మ మాట్లాడుతూ మోడీని తన కుమారుడిగా ప్రకటించింది.
మధ్య ప్రదేశ్ లోని రాజ్ గడ్ హరిపుర గ్రామానికి చెందిన మంగీభాయికి వందేళ్లు ఉంటాయి. అయితే ఆమె మాట్లాడుతూ నాకు 14 మంది సంతానం ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీని నేను 15వ కుమారుడిగా భావిస్తాను. ఆయన ఈ దేశానికి ఎంతో రక్షణగా నిలుస్తున్నాడు. అలాంటి వ్యక్తిని నా కొడుకుగా స్వీకరిస్తాను. నాకున్న 25 ఎకరాల ఆస్తిని మోడీకి రాసిస్తాను అంటూ సంచలన ప్రకటన చేసింది ఈ బామ్మ. ఎందుకు ఇలా రాసిస్తావు అని అడిగితే.. మోడీ వల్లే నేను ఈ రోజు ఇంత సంతోషంగా బతుకుతున్నాను. ఆయన నాకు సొంత ఇల్లు ఇప్పించారు.
Modi : మోడీ నా 15వ కొడుకు.. 25 ఎకరాలు రాసిస్తా.. వందేళ్ల బామ్మ స్టేట్ మెంట్..!
నాకు వితంతు పింఛన్ ఇప్పిస్తున్నాడు. అంతే కాకుండా నాకు ఉచితంగా ఆస్పత్రిలో చూపించుకునే వెసలుబాటు కల్పించాడు. ఆయన వల్లే నేను తీర్థ యాత్రలకు వెళ్లగలుగుతున్నాను అంటూ ఎమోషనల్ అయింది ఈ బామ్మ. ఇప్పటి వరకు తాను నరేంద్ర మోడీని చూడలేదని.. అవకాశం వస్తే నేరుగా కలుస్తానంటూ చెప్పుకొచ్చింది ఈ బామ్మ. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వందేళ్ల బామ్మకు మోడీ మీద ఉన్న ప్రేమను చూసిన బీజేపీ శ్రేణులు మురిసిపోతున్నారు. ఎన్నికల సమయంలో ఇలాంటివి కామనే అని కాంగ్రెస్ వాళ్లు కొట్టేస్తున్నారు.
అయితే మోడీని ప్రేమించే వాళ్లు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నారంటూ బీజేపీ ప్రచారం చేసుకుంటోంది. ఇలా ఎప్పటికప్పుడు మోడీ వేవ్ పెరుగుతోందని.. రాబోయే ఎన్నికల్లో నాలుగు వందల సీట్లు పక్కాగా గెలుస్తామంటూ బీజేపీ ప్రచారం చేసుకుంటోంది.
Rohit Sharma : ఐపీఎల్-2025 లో సీఎస్కేతో తాజాగా జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ అద్భుత ప్రదర్శన కనబరిచి ఘన…
Gap In Teeth : కొన్ని శాస్త్రాలు పళ్ళ మధ్య కాలు ఏర్పడటానికి అనేక కారణాలు ఉన్నాయని పండితులు తెలియజేస్తున్నారు.…
Daily One Carrot : కొన్ని కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిల్లో దుంపలు కూడా ఒకటి. అవే…
Toothpaste : వెనుకటి కాలాలలో టూత్ పేస్ట్ అంటేనే తెలియదు. అప్పట్లో పండ్లను తోమాలంటే.. వేప కొమ్మలు, ఇటుక పొడి, బొగ్గు…
TGSRTC Jobs తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC)లో ఉద్యోగాల కోసం నిరీక్షణలో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త తెలిపారు…
Nutmeg Drink : ప్రకృతి ఆయుర్వేద వైద్యంలో విశేష ప్రాధాన్యత కలిగిన జాజికాయ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తూ అనేక…
Bhu Bharati : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ పరిపాలన వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడంలో కీలక ముందడుగు వేసింది. అక్రమ…
Today Gold Price : దేశంలో బంగారం ధరలు ఏప్రిల్ 21న స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదల…
This website uses cookies.