Electric Car : కొత్త కారు కొనాలంటే కచ్చితంగా 7 లక్షలైనా ఖర్చు చేయాల్సిందే. అప్పుడే మీరు కొత్త కారు కొనగలుగుతారు.ఇక ఎలక్ట్రిక్ కారు విషయానికి వస్తే దాదాపు 10 లక్షలు ఖర్చు చేయాల్సిందే. అంతేకాక ప్రస్తుతం మార్కెట్ లో ఇదే ట్రెండ్ కొనసాగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఎలక్ట్రిక్ కార్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఎలక్ట్రిక్ కారు కనీస ప్రారంభ ధర 10 లక్షలుగా కొనసాగుతుంది. అయితే ఇప్పుడు ఎలక్ట్రిక్ కారు కేవలం 3.6 లక్షలకి వస్తుంది అంటే నమ్ముతారా…?అవును ఇది నిజమే.. ఇది అదిరిపోయే ఆఫర్ అని చెప్పుకోవచ్చు. మరి నిజంగానే ఇంత తక్కువ ధరలో ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేయవచ్చా…?మరి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
అయితే తాజాగా అతి తక్కువ ధరలో ఎలక్ట్రిక్ కారు ఒకటి మార్కెట్ లో అందుబాటులోకి వచ్చింది. అయితే తాజాగా చైనాకు చెందిన స్మాల్ ఎలక్ట్రిక్ కారు తయారీ కంపెనీ జీడో కొత్త కారును ఆవిష్కరించింది. ఇక ఈ కారు పేరు రెయిన్ బో మినీ ఈవీ.. ప్రస్తుతం ఈ కార్ చైనాలో మాత్రమే అందుబాటులో ఉంది. ఇక ఈ కార్ అచ్చం చూడడానికి ఎంజి కామెట్ మాదిరిగానే ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ కొత్త స్మాల్ ఎలక్ట్రికల్ కారు ధర 4400 డాలర్ల నుండి గరిష్టంగా 6000 డాలర్ల వరకు ఉంది. అంటే మన కరెన్సీ ప్రకారం చూసుకుంటే 3.6 లక్షల నుండి 5 లక్షల వరకు ఉంటుందన్నమాట. ఇంత తక్కువ ధరలో ఎలక్ట్రిక్ కారు దొరకడం అంటే అదృష్టమనే చెప్పాలి కదా..
ఇక ఈ కార్ స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే దీని పొడవు 3224 ఎంఎం , వెడల్పు 1515 గా ఉంటుంది. ఇక ఎత్తు విషయానికి వస్తే 1630 ఉంటుంది. దీని వీల్ బేస్ 2100 ఎంఎం ఉంటుంది. చూడటానికి ఈ కార్ చాలా చిన్నగా అనిపించినప్పటికి ఈ కారు లో 3 డోర్స్ , 4 సీట్స్ అందుబాటులో ఉన్నాయి.
ఇక ఈ కార్ డిజైన్ విషయానికి వస్తే.. ఇది రౌండ్ ఆఫ్ డిజైన్ లో కనిపిస్తుంది. అలాగే దీని డిజైన్ అచ్చం కామెట్ మాదిరిగానే ఉంటుంది. అలాగే ఈ కారులో 13 ఇంచుల నుండి 15 ఇంచుల రొమాన్ షిల్డ్ వీల్ హబ్ క్యాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ కార్ ఏడు కలర్స్ లో మనకు అందుబాటులో ఉంది. పింక్, పర్పుల్, బ్రౌన్ ,యెల్లో ,సియాన్, గ్రీన్ వంటి కలర్స్ లో అందుబాటులో ఉంది.
అలాగే ఈ కారులో పింక్ బ్యాక్ గ్రౌండ్ డబల్ ఫోక్ స్టీరింగ్ వీల్, 5 ఇంచుల ఫుల్ హెచ్ డీ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ తో 9 ఇంచుల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ ఉంది. అలాగే దీనిలో మొబైల్ ఫోన్ రిమోట్ వెహికల్ కంట్రోల్ కూడా అందుబాటులో ఉంది.
బ్యాటరీ…
ఈ కారు లో లిథియం అయాన్ బ్యాటరీ అమర్చడం జరిగింది. ఇక దీనిలో బ్యాటరీ అనేది మూడు ఆప్షన్స్ లో లభిస్తుంది. 9.98 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ కారు అయితే దాదాపు 125 కిలోమీటర్ల రేంజ్ వరకు వెళుతుంది. 17.18 కేడబ్ల్యు హెచ్ బ్యాటరీ కలిగి ఉంటే 205 కిలోమీటర్లు వస్తుంది. అలాగే 17.3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉన్న కారు అయితే 201 కిలోమీటర్లు వెళ్తుంది. అయితే ఇక్కడ కార్ బ్యాటరీ ఆప్షన్ ఆధారంగా ధర కూడా మారుతుంది.
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
This website uses cookies.