Election Commissioners : కేంద్ర ఎన్నికల సంఘంలో కమిషనర్లుగా ఇద్దరు విశ్రాంత ఐఏఎస్ అధికారులు సుఖ్‌బీర్ సింగ్ సంధు, జ్ఞానేష్ కుమార్‌లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన హపవర్డ్ కమిటీ ఈ ఇద్దరు అధికారులను ఎలక్షన్ కమిషనర్లుగా ఎంపిక చేసింది. 1988 బ్యాచ్‌కు చెందిన ఆ ఇద్దరు సివిల్ సర్వెంట్లలో సంధు ఉత్తరాఖండ్ క్యాడర్ అధికారి కాగా జ్ఞానేష్ కుమార్ కేరళ క్యాడర్ అధికారి. వీరి ఎంపికకు సంబంధించి సాయంత్రానికే అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. గురువారం ఉదయం ఢిల్లిdలో ప్రధాని అధ్యక్షతన జరిగిన #హపవర్డ్ కమిటీ సమావేశంలో కమిటీ సభ్యులుగా ఉన్న అధిర్ రంజన్ చౌదరితో పాటు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ పాల్గొన్నారు. సమావేశం ముగిసిన తర్వాత అధిర్ రంజన్ చౌదరి మీడియాతో మాట్లాడారు. తొలుత తనకు మొత్తం 212 మంది పేర్లతో ఉన్న జాబితాను పంపించారని, తీరా సమావేశానికి కొన్ని నిమిషాల ముందు సెర్చ్ కమిటీ వడపోసి రూపొందించిన 6 పేర్లతో కూడిన జాబితా ఇచ్చారని చెప్పారు. #హపవర్డ్ కమిటీలో తనను సభ్యుడిగా పెట్టినప్పటికీ ముగ్గురిలో ఇద్దరు ప్రభుత్వం నుంచే ఉన్నారని, తన పాత్ర నామమాత్రమేనని అన్నారు. అందుకే తాము ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నామని, 2023లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం మూడో సభ్యుడిగా భారత ప్రధాన న్యాయమూర్తినే కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.
సార్వత్రిక ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసుకుని ఇక తేదీలను మాత్రమే ప్రకటించాల్సిన సమయంలో కేంద్ర ఎన్నికల సంఘంలో అనూహ్యంగా రెండు కీలక పదవులు ఖాళీ అయ్యాయి. ఈసీలో కమిషనర్‌గా ఉన్న అనూప్ చంద్ర పాండే గత నెల 14న పదవీ విరమణ పొందగా, మరో కమిషనర్ అరుణ్ గోయల్ అకస్మాత్తుగా మార్చి 9న తన పదవికి రాజీనామా చేశారు. ఫలితంగా కొద్ది రోజుల వ్యవధిలోనే రెండు కీలకమైన పదవులకు ఖాళీలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ మాత్రమే పదవిలో ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఈ రెండు పదవులను వెంటనే భర్తీ చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. రాజ్యాంగంలోని ఆర్డికల్ 324 క్లాజ్ 2 ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌తో పాటు రాష్ట్రపతి నిర్ణయానుసారం ఎలక్షన్ కమిషనర్లు కూడా ఉండాలి. ఆ కమిషనర్ల సంఖ్య ఎంత అన్నది రాష్ట్రపతే నిర్ణయిస్తారు. కేంద్ర ఎన్నికల సంఘంలో ఉన్నతాధికారుల నియామకాన్ని పారదర్శకంగా ఉంచేందుకు సుప్రీంకోర్టు గత ఏడాది ఇచ్చిన తీర్పులో కొన్ని మార్గదర్శకాలు రూపొందించింది. నియామక ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రధాన ప్రతిపక్షం, సుప్రీంకోర్టును కూడా భాగం చేసింది. ప్రధాన మంత్రి అధ్యక్షతన ఒక హపవర్డ్ కమిటీని ఏర్పాటు చేస్తూ.. సభ్యులుగా లోక్‌సభలో ప్రతిపక్ష నేతతో పాటు భారత ప్రధాన న్యాయమూర్తిని చేర్చింది. కానీ కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ఒక కొత్త చట్టాన్ని తీసుకొస్తూ హపవర్డ్ కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగించి, ఆ స్థానంలో కేంద్ర న్యాయశాఖ మంత్రిని సభ్యులుగా చేర్చింది. ఈ చట్టాన్ని కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలన్నీ తీవ్రంగా వ్యతిరేకించాయి. సంఖ్యాబలం ప్రకారం చట్టాన్ని పార్లమెంటులో అడ్డుకోలేకపోయాయి. కానీ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఆ పిటిషన్ శుక్రవారం (మార్చి 15న) విచారణకు రానుంది. దీనిపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు సైతం ఇచ్చే అవకాశం ఉంది. ఈలోగానే కేంద్రం కొత్త చట్టం ప్రకారం నియామక ప్రక్రియను ప్రారంభించింది.
కేంద్ర ఎన్నికల సంఘంలో ఖాళీగా ఉన్న కమిషనర్ పోస్టుల కోసం సెర్చ్ కమిటీ దేశవ్యాప్తంగా ఆలిండియా సర్వీస్ అధికారులతో పాటు ఈ మధ్యనే పదవీ విరమణ పొందిన అధికారులతో జాబితాను రూపొందించి, వడపోసింది. కేంద్ర సర్వీసుల్లో 60 ఏళ్లకు పదవీ విరమణ పొందితే.. కేంద్ర ఎన్నికల సంఘంలో ఆ వయోపరిమితి 65 ఏళ్ల వరకు ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘంలో నియమితులయ్యే అధికారి గరిష్టంగా ఆరేళ్లకు మించి పనిచేయడానికి వీల్లేదు. అందుకే ఈ ఏడాదిలో పదవీ విరమణ పొందేవారితో పాటు ఈ మధ్యనే పదవీ విరమణ పొందినవారిని సెర్చ్ కమిటీ వడపోసి మొత్తం 200 మందికి పైగా ఉన్న జాబితా నుంచి ఆరుగురిని షార్ట్‌లిస్ట్ చేసింది. తాజాగా సెర్చ్ కమిటీ రూపొందించిన జాబితాలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ), నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) వంటి ప్రతిష్టాత్మక కేంద్ర దర్యాప్తు సంస్థల్లో పనిచేసిన అధికారులు కూడా ఉన్నారు. కమిటీ సమావేశంలో ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ఈ ఏడాది జనవరి 31న పదవీ విరమణ పొందిన సుఖ్‌బీర్ సింగ్ సంధుతో పాటు కేంద్ర సహకరశాఖలో కార్యదర్శిగా పనిచేసిన జ్ఞానేష్ కుమార్ పేర్లను ఎంపిక చేసింది. కమిటీ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతికి పంపించింది. సాయంత్రానికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేయగా, ఆ వెంటనే గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో శుక్రవారం లోక్‌సభతో పాటు కొన్ని రాష్ట్రాల అసెంబ్లిd ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయనున్నట్టు ప్రచారం జరుగుతోంది.
కొన్ని సంవత్సరాలుగా వాయిదా పడుతూ వస్తున్న జనాభా లెక్కింపు అంశంపై బ్లూమ్‌బర్గ్ మీడియా తాజా కథనం విడుదల చేసింది. సార్వత్రిక ఎన్నికల తర్వాతే భారతదేశంలో జనగణన చేపట్టే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఈ ప్రక్రియ నిర్వహణ కోసం సుమారు మూడు లక్షల మంది ప్రభుత్వ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారని కూడా తెలిపింది. జనాభా లెక్కల సర్వే దాదాపు ఏడాది పాటు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తున్నది. స్వాతంత్య్రానంతరం దేశంలో 1981 సంవత్సరంలో మొదటిసారి జనగణన నిర్వహించారు. అప్పటి నుంచి ప్రతి పదేళ్ల కోసారి జనగణన జరుగుతూ వచ్చింది. తద్వారా భారత దేశ జనాభా పెరుగుదలను నిర్దిష్ట కాలానికి అంచనా వేస్తూ వచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు, కార్యక్రమాలు, సంక్షేమ పథకాల రూపకల్పనకు ఇదే ఆధారం. చివరిసారిగా 2011లో జనాభా లెక్కల ప్రక్రియ చేపట్టారు. షెడ్యూల్ ప్రకారం 2021లో తిరిగి నిర్వహించాల్సి ఉన్నప్పటికీ, కరోనా, ఇతర కారణాలతో వాయిదా వేస్తూ వచ్చారు.
దీనివల్ల సంక్షేమ పథకాల అమలులో అంతరాలు, వ్యత్యాసాలు ఏర్పడుతున్నాయి. 2011 నాటి లెక్కల ప్రకారం జరిగిన రేషన్ కార్డుల జారీవల్ల కనీసం పది కోట్ల మంది వరకు అర్హులకు సంక్షేమ పథకాలు అందడం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే లోక్‌సభ ఎన్నికల తర్వాత జనగణన చేపట్టేందుకు కేంద్రం సిద్ధమైనంట్లు తెలుస్తున్నది. ఇటీవల తాత్కాలిక బడ్జెట్‌లోనూ ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా కేటాయింపులు జరిపారు. అయితే జనగణనలో ఈసారి కొత్త డిమాండ్లు వినిపిస్తున్నాయి. మునుపటి విధానానికి భిన్నంగా, కులాల ఆధారంగా జనాభాను లెక్కించాలని విపక్షాలు కూడా పట్టుబడుతున్నాయి. గతేడాది ఏప్రిల్‌లో చైనాను అధిగమించి అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అగ్రస్థానానికి చేరినట్లు ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఐరాస నివేదిక ప్రకారం మనదేశ ప్రస్తుత జనాభా 141 కోట్లు. జనగణన పూర్తయితే వాస్తవిక గణాంకాలు వెల్లడయ్యే అవకాశముంది.
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
This website uses cookies.