Old Book : అదృష్టం జీవితంలో ఒక్కసారి తలుపు తడుతుంది. ఆ ఒక్కసారి మిస్ అయితే మళ్ళీ తిరిగి రాదు. కొందరు సడన్గా కోటీశ్వరులు అవుతూ ఉంటారు. వారిని చూస్తే అదృష్టం వెతుక్కుంటూ వచ్చిందనిపిస్తుంది. ఎవరికైనా అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో తెలియదు. కొందరూ రాత్రి , పగలు కష్టపడి రూపాయి రూపాయి కూడ పెట్టుకుని డబ్బులు పోగేసుకుంటూ ఉంటారు. మరికొందరు రాత్రికి రాత్రి కోటీశ్వరులు అయిపోతారు. ఇటీవల పొలంలో వజ్రం దొరికితే ఓ రైతు దానిని వ్యాపారికి చూపించగా రెండు కోట్ల రూపాయలు విలువచేసేదిగా తేలింది.
అలాగే కేరళలో లాటరీ తగిలి ఒకరు, విదేశాల్లో ఉండే భారతీయులు కూడా లాటరీ జాక్పాట్ తగిలి కోటీశ్వరులు అయిన వారు ఉన్నారు. ఇలా అదృష్టం వరించిన వారు చాలామంది ఉన్నారు. తాజాగా చెత్తలో దొరికిన పాత పుస్తకం ద్వారా ఓ వ్యక్తి రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు. ఈ ఘటన చిలీ దేశంలో జరిగింది. యునో జోసా అనే వ్యక్తికి తన ఇల్లు శుభ్రం చేస్తుండగా అతడికి పాత కాగితాలలో పుస్తకం దొరికింది. దానిని పరిశీలించి అది 60 సంవత్సరాలు క్రిందటి పుస్తకం అని గుర్తించారు. అది తన తండ్రి బ్యాంకు పాస్ పుస్తకం. అందులో అన్ని విషయాలు పరిశీలించాడు. జోసా తండ్రి 1960 నుంచి 70 కాలంలో కోటి 40 లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేశాడు.ఆ డబ్బుతో ఇంటిని కొనేందుకు ప్లాన్ చేసుకున్నాడు. ఇల్లు కొనకుండానే అతని తండ్రి చనిపోయాడు. దాదాపు 60 సంవత్సరాలు బ్యాంకు పాస్ పుస్తకం చెత్త కాగితాల్లో ఉండిపోవడంతో, అతను డిపాజిట్ చేసిన డబ్బు బ్యాంకు లోనే ఉండిపోయాయి. ఇటీవల యునో జోసాకు పాస్ పుస్తకం దొరికింది.
దీంతో అతను బ్యాంక్ సిబ్బందిని సంప్రదించి డబ్బులు గురించి తెలుసుకున్నాడు. బ్యాంక్ సిబ్బంది డబ్బులు ఇవ్వడం కుదరదని చెప్పారు. దీంతో అతడు బ్యాంక్ సిబ్బందిపై కోర్టులో కేసు వేశాడు. తాజాగా కోర్టు విచారణ జరిపి యునో జోసాకు అనుకూలంగా తీర్పునిచ్చింది. కోర్టు వడ్డీతో సహా డబ్బులు తిరిగి చెల్లించాలని, బ్యాంక్ సిబ్బందిని ఆదేశించింది. ఈ విధంగా యునో జోసా ఏకంగా 10 కోట్ల ను బ్యాంకు ద్వారా పొందాడు. తన తండ్రి సేవింగ్స్ 60 ఏళ్ల తర్వాత కొడుకుని కోటీశ్వరుడిని చేసింది.
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
This website uses cookies.