Old rickshaw Wala 2.5 Crores lottery : గురుదేవ్ సింగ్ అనే వృద్ధ రిక్షావాలా లాటరీ గెలుచుకొని కోటీశ్వరుడు అయ్యాడు. 7 నెలల క్రితం మోగాకు చెందిన గురుదేవ్ సింగ్ లాటరీలో 2.5 కోట్లను గెలుచుకున్నాడు. అయినప్పటికీ ఆయన సాదాసీదాగా జీవిస్తున్నారు. లాటరీ లో అంత గెలుచుకున్న గురుదేవ్ సింగ్ ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేయడానికి ఇష్టపడతారట. అందుకే తన వృత్తి అయిన రిక్షాను తోలుతూ జీవనం సాగిస్తున్నాడు. సాధారణ జీవితం అంటేనే తనకు ఇష్టమని చెబుతున్నాడు. లాటరీలో గెలుచుకున్న డబ్బుతో గురుదేవ్ తన కొడుకులు, కూతుర్లకు మంచి ఇల్లు కట్టించి వాహనాలు ఇప్పించారట. తన కూతురు అద్దె ఇంట్లో ఉంటుందని ఆమెకు ఇల్లు కట్టించారట. అలాగే కొడుకులకు కూడా మంచి ఇల్లు కట్టించి కార్లు, బైకులు కొనిచ్చారట.
డబ్బును తన పిల్లల కోసం వినియోగించాలని గురుదేవ్ సింగ్ చెప్పుకొచ్చారు. రిక్షా తొక్కడంతో పాటు గురుదేవ్ సింగ్ చాలా సామాజిక పనులను చేస్తుంటారు. ఆయన సామాజిక కార్యక్రమాలకు చాలామంది యువత స్ఫూర్తి పొందుతున్నారు. గతంలో గురుదేవ్ సింగ్ మొక్కలను పెంచుతూ ఉండేవారట. లాటరీ లో అన్ని డబ్బులు వచ్చిన తర్వాత కూడా గురుదేవ్ సింగ్ అదే పనిని కొనసాగిస్తున్నారు. మొక్కలు పెంచడం తనకు సంతృప్తి నిస్తుందని చెబుతున్నారు. అలాగే పప్పు రోటి తింటూ సాదాసీదాగా ఉండడమే తనకు ఇష్టమని గురుదేవ్ సింగ్ చెబుతున్నారు. ఇక ఆయన కొడుకు మాట్లాడుతూ.. ఈరోజుల్లో 100 రూపాయలు గెలిస్తే ప్రవర్తన మారిపోతుంది. కానీ కోట్లు గెలిచిన మా నాన్న సాదాసీదాగా ఉంటారని తెలిపారు. ఆయన అందరికీ స్ఫూర్తిదాయకం అని అన్నారు.
కోట్లు ఉన్నప్పటికీ ఆయన ప్రవర్తనలో మార్పు రాలేదు. రిక్షా తొక్కుతూ చాలా సాధారణ జీవితం గడుపుతున్నారు. గతంలో ఆయన రోడ్ల పక్కన చెట్లను పెంచుతూ ఉండేవారు ఇప్పుడు కూడా అలానే చేస్తున్నారు. ఏప్రిల్ లో గురుదేవ్ సింగ్ లాటరీలో రెండున్నర కోట్లు గెలిచాడు. ఆ తర్వాత కూడా ఆయన లాటరీ టికెట్లను కొంటూనే ఉన్నారు. ఇక ఆయన లాటరీ రెండున్నర కోట్లు గెలుచుకున్న సాదాసీదాగా ఉండడం మామూలు విషయం కాదు ఈ రోజుల్లో చేతిలో డబ్బు పడితే మనిషి ప్రవర్తన మారిపోతుంది అలాంటిది గురుదేవ్ సింగ్ కోటీశ్వరుడు అయినప్పటికీ తన పని తాను చేసుకుంటూ చాలా సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు అలాగే సామాజిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు గురుదేవ్ సింగ్ అందరికీ స్ఫూర్తిదాయకం అని చెప్పాలి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.