PM Kisan Yojana : పీఎం కిసాన్ యోజన పథకం అప్ డేట్...17వ విడత ఎప్పుడు విడుదల చేస్తారంటే...!
PM Kisan Yojana : భారతదేశంలోని రైతులందరికీ లబ్ధి చేకూరే దిశగా కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం పీఎం కిసాన్ యోజన. అయితే ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం అర్హులైన రైతులందరికీ ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు. ఇక ఈ పథకం 2019 ఫిబ్రవరిలో అమలులోకి తీసుకురాగా అప్పటినుండి ఇప్పటివరకు ఏడాదికి 6000 రూపాయలు చొప్పున ప్రతి రైతుకు పంటసాయంగా ఇస్తున్నారు. అయితే ఈ పథకం ద్వారా రైతులకు ఇచ్చే ఈ 6000 రూపాయలను మొత్తం మూడు విడతలలో రైతుల బ్యాంకు ఖాతాలో కేంద్ర ప్రభుత్వం జమ చేస్తూ వస్తోంది. ఏప్రిల్ – జూలై ,ఆగస్టు – నవంబర్ , డిసెంబర్ – మర్చి సమయంలో 2000 చొప్పున కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది.
అయితే తాజాగా ఈ పథకానికి సంబంధించి 16వ విడత నిధులు ప్రధాని మోడీ విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 28న రైతుల ఖాతాల్లోకి డబ్బు జమ చేయబడింది. అయితే ఈ పథకంలో భాగంగా మొత్తం దేశంలో 9 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరినట్లుగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.అయితే షెడ్యూల్ ప్రకారం ప్రతి నాలుగు నెలలకు ఒకసారి పీఎం కిసాన్ నిధులను విడుదల చేయడం జరుగుతుంది. దీంతో ప్రస్తుతం రైతుల దృష్టి మొత్తం 17వ విడత నిధుల విడుదలపై ఉంది అని చెప్పాలి. దీంతో ప్రస్తుతం ఈ నిధులు ఎప్పుడు విడుదలవుతాయనే దానిపై చర్చలు జరుగుతున్నాయి.అయితే పీఎం కిసాన్ నిధుల విడుదల అనేది ప్రతి నాలుగు నెలలకు ఒకసారి చేస్తారు. కాబట్టి ఫిబ్రవరి నుంచి చూసుకున్నట్లయితే జూన్ నెలలో 17వ విడత నిధులు విడుదల కావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఎలక్షన్ కూడా అమలులో ఉండటం వలన పీఎం కిసాన్ పథకం నుండి వచ్చే నిధులు ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.
PM Kisan Yojana : పీఎం కిసాన్ యోజన పథకం అప్ డేట్…17వ విడత ఎప్పుడు విడుదల చేస్తారంటే…!
ఇది ఇలా ఉండగా పీఎం కిసాన్ 16వ విడత డబ్బు అర్హులైన రైతులకు జమ కాలేదంటే వెంటనే ఫిర్యాదు చేయవచ్చు. దానికోసం పీఎం కిసాన్ సమ్మాన్ హెల్ప్ లైన్ నెంబర్ 011-24300606 కు ఫిర్యాదు చేయవచ్చు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పీఎం కిసాన్ యోజన నగదు పొందాలంటే రైతులు కచ్చితంగా ఈ-కేవైసీ ని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ-కేవైసీ పూర్తిచేసిన వారికి మాత్రమే పీఎం కిసాన్ పథకం ద్వారా నగదు ఖాతాలో పడుతుంది. ఈ-కేవైసీ పూర్తి చేయనివారు ఆన్ లైన్ విధానంలో ఈ-కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. అలాగే మీ బ్యాంకు ఖాతాను కూడా ఆధార్ తో లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ 2 పనులు పూర్తి చేయకపోతే పీఎం కిసాన్ 16వ విడత డబ్బు మీ ఖాతాలోకి జమ కాదు. కాబట్టి అర్హులైన రైతులందరూ వెంటనే ఈ-కేవైసి పూర్తి చేయడం మంచిది.
TG Govt | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం మరింత వేగంగా అమలుకు సిద్ధమవుతోంది.…
Accenture | ఏపీలో ఐటీ హబ్‌గా ఎదుగుతున్న విశాఖపట్నం తీరానికి మరో అంతర్జాతీయ టెక్ దిగ్గజం రానుంది. ఇక్కడ భారీ…
Digital Arrest | సైబర్ నేరస్తులు మరింతగా రెచ్చిపోతున్నారు. రోజు రోజుకూ కొత్త కొత్త పద్ధతుల్లో అమాయకులను బలి తీసుకుంటున్నారు.…
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా రేపు గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అడ్వాన్స్ సేల్స్…
Cashew Nuts | డ్రై ఫ్రూట్స్‌లో జీడిపప్పు చాలా మందికి ఇష్టమైనది. ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలతో పాటు మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు…
Belly Fat | ఇప్పటి జీవనశైలిలో చాలా మంది బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతున్నారు. నిపుణుల ప్రకారం మనం తినే…
Papaya | చాలామంది రాత్రి భోజనం తర్వాత తేలికపాటి ఆహారం తీసుకోవాలని అనుకుంటారు. అలాంటి సమయంలో బొప్పాయి (Papaya) ఒక ఉత్తమ…
Facial Fact | వయసు పెరిగేకొద్దీ ముఖంపై కొవ్వు పెరగడం సహజం. ఈ సమస్య కారణంగా చాలా మందికి డబుల్…
This website uses cookies.