
Thyroid : థైరాయిడ్ సమస్య వేధిస్తోందా...? వీటిని తీసుకోవడం వలన ఇట్టే ఉపసమనం...!
Thyroid : ప్రస్తుత కాలంలో మహిళల్లో ఎక్కువగా థైరాయిడ్ సమస్యలు కనిపిస్తున్నాయి. అయితే ఇది ఒక తీవ్రమైన జీవనశైలి వ్యాధి అని చెప్పాలి. ఇక ఈ వ్యాధి చాలా కాలంగా సరేనా ఆహారం అలాగే నిశ్చల జీవనశైలని అనుసరించడం వలన మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే వాస్తవానికి థైరాయిడ్ అనేది మెడపై ఉండే ఒక చిన్న గ్రంధి. ఇక దీని ఆకారం సీతాకోకచిలుక లాగా కనిపిస్తుంది. కొన్ని ముఖ్యమైన హార్మోన్ల ఉత్పత్తిలో ఈ గ్రంధి కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. అయితే ఈ థైరాయిడ్ గ్రంధి సరిగా పని చేయనప్పుడు తగినంత హార్మోన్లను విడుదల చేయలేదు. దీని కారణంగా జీవక్రియ మందగిస్తుంది లేదా వేగవంతం అవుతుంది అని చెప్పాలి. అయితే శరీరంలో ఇతర హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి జీవక్రియ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా థైరాయిడ్ పనితీరు సరిగా లేకపోవడం వలన శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది.
తద్వారా మహిళలు క్రమం తప్పకుండా పీరియడ్స్ ,తీవ్రమైన నొప్పి , తిమ్మిరి వంటి ఇతర సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఆరోగ్యకరమైన జీవన శైలిలో కొన్ని ముఖ్యమైన మార్పులు చేయడం వలన థైరాయిడ్ పనితీరును మెరుగుపరచవచ్చు. ఇక థైరాయిడ్ సమస్యతో బాధపడే స్త్రీలు వాటిని రోజువారి ఆహారంలో భాగంగా చేసుకున్నట్లయితే మంచి ఫలితాలను పొందుతారు. మరి ఆ ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
మజ్జిగ : మాంసకృతులు కాల్షియం విటమిన్ బి వంటి పోషకాలు పుష్కలంగా కలిగి ఉన్న మజ్జిగ ప్రెగులకు చాలా ఉపయోగకరమైనదని నిపుణులు చెబుతున్నారు. ఇది శక్తివంతమైన ప్రోబయోటిక్. ఇక ఇది ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియాని పెంచడానికి ఎంతగానో సహాయపడుతుంది. కావున దీనిని తాగటం వలన జీర్ణక్రియ మెరుగు పడుతుంది. అదేవిధంగా థైరాయిడ్ పనితీరు మెరుగుపడుతుంది.
ఆకుపచ్చ కూరగాయలు : ఆకుకూరల్లో పోషకాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. మరి ముఖ్యంగా ఆకుకూరల్లో విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. కావున ఈ జ్యూస్ తాగడం వలన శరీరంలో రక్తహీనత తొలగి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అవికాస్త థైరాయిడ్ పనితీరును మెరుగుపరచడానికి ఎంతగానో సహాయపడతాయి.
బీట్ రూట్ , క్యారెట్ జ్యూస్ : బీట్ రూట్ మరియు క్యారెట్ జ్యూస్ లో విటమిన్ ఏ ,బి ,సి తోపాటు ఐరన్ పోలిక్ యాసిడ్ లైకోపిన్ ,ఫైటోనూట్రియంట్ పుష్కలంగా లభిస్తాయి. ఇక ఈ జ్యూస్ ప్రతిరోజు తాగటం వలన థైరాయిడ్ గ్రంధికి అవసరమైన పోషణ లభిస్తుంది.
మూలికల టీ : ప్రస్తుత కాలంలో చాలామంది టీ అభిమానులుు ఉంటారు. అయితే మిల్క్ టీ కి బదులుగా చమోమిలేటి గ్రీన్ టీ , అల్లం టీ , జీలకర్ర, ఆకుకూరలు వంటి కొన్ని హెర్బల్ టీలు తాగడం వలన మహిళల్లో థైరాయిడ్ సమస్య దరిచేరదు. ఇవి శరీరంలోని హార్మోన్ల సమస్యను మెరుగుపరిచి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది.
పసుపు పాలు : ఈ పసుపు పాల పానియం అనేది ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రతిరోజు పసుపు నీళ్ళు తాగటం మంచిదని నిపుణులు కూడా చెబుతుంటారు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు ,యాంటీ ఇంప్లిమెంటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు ఈ పానియం తాగడం వలన థైరాయిడ్ గ్రంధి వాపు తగ్గిస్తుంది.
గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. ది తెలుగు న్యూస్ దీనిని ధృవీకరించలేదు.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.