Priyanka Gandhi : ప్రస్తుతం ఎక్కడ చూసిన కూడా ఎన్నికల హంగామా నడుస్తుంది. ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటూ రచ్చ చేస్తున్నారు. స్టేట్‌లోనే కాదు సెంట్రల్‌లో కూడా రాజకీయం మరింత రంజుగా మారింది.తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడడం చర్చనీయాంశం అయింది. దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన ప్రధానులతో పాటు ఎందరో ప్రధానులను తాను చూశానని, కానీ బహిరంగంగా పచ్చి అబద్ధాలు చెప్పే ప్రధానిని చూడటం మాత్రం ఇదే మొదటిసారని ఆమె చెప్పుకొచ్చారు.. ”సంపద పంపిణీ” హామీ పేరుతో కాంగ్రెస్ పార్టీ మహిళల మంగళసూత్రాలు కూడా ఊడలాక్కుంటుందంటూ మోదీ అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.
, కాంగ్రెస్ మేనిఫెస్టో చూసి భయంతోనే ఆయన ఇలాంటి ఆరోపణలకు దిగుతున్నారని తప్పుపట్టారు. సంపద పునఃపంపిణీపై విమర్శలు చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీని .. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ లో ఒక మూలన కూర్చుని అర్థంపర్థం లేని మాటలు మాట్లాడే అంకుల్ తో పోల్చారు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ప్రియాంక గాంధీ . ఆ మాటలు పట్టించుకోవద్దని, అలాంటి హాస్యాస్పద మాటలను విని నవ్వుకోవాలని ఓటర్లకు సూచించారు. ‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీ నగలు, మంగళసూత్రం దొంగిలించి వేరొకరికి ఇస్తుంది అని మోదీ అంటున్నారు. ఈ అర్థం లేని మాటలు విన్న తరువాత.. ఏం చేయాలి.. కాసేపు నవ్వుకోవాలి’’ అని ప్రియాంక వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
ప్రధాని హోదాలో ఉన్నాను కాబట్టి.. నేను ఏం మాట్లాడినా.. ఎంత అర్థంపర్థం లేకుండా మాట్లాడినా ప్రజలు నమ్ముతారని ఆయన భావిస్తున్నారు అని ప్రియాంక గాంధీ విమర్శించారు. ‘‘కాంగ్రెస్ పార్టీ ఎక్స్ రే యంత్రంతో ప్రజల ఇళ్లలోకి ప్రవేశించి సోదాలు చేస్తుందని, ఆ తర్వాత మీ నగలతో పాటు భద్రపరిచిన మంగళసూత్రాన్ని కూడా లాక్కుని ఇతరులకు ఇస్తుందని ప్రధాని ప్రజలను హెచ్చరిస్తున్నారు. అది సాధ్యమేనా? అంత అర్థం లేకుండా ఎవరైనా మాట్లాడుతారా? ఓటమి భయంతోనే ఆయన ఇలా మాట్లాడుతున్నారా?’’ అని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. మోదీ పాలనలో నిత్యావసరాల ధరలు పెరగడాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘ఆయన ఖరీదైన మనిషి’’ అని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.