Priyanka Gandhi : మోదీని అంకుల్ అంటూ ప్రియాంక గాంధీ ప‌వ‌ర్ పంచ్‌లు.. మాములు న‌వ్వురాదు..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Priyanka Gandhi : మోదీని అంకుల్ అంటూ ప్రియాంక గాంధీ ప‌వ‌ర్ పంచ్‌లు.. మాములు న‌వ్వురాదు..!

Priyanka Gandhi  : ప్ర‌స్తుతం ఎక్కడ చూసిన కూడా ఎన్నిక‌ల హంగామా న‌డుస్తుంది. ఒక‌రిపై ఒక‌రు దుమ్మెత్తిపోసుకుంటూ ర‌చ్చ చేస్తున్నారు. స్టేట్‌లోనే కాదు సెంట్ర‌ల్‌లో కూడా రాజ‌కీయం మ‌రింత రంజుగా మారింది.తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది. దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన ప్రధానులతో పాటు ఎందరో ప్రధానులను తాను చూశానని, కానీ బహిరంగంగా పచ్చి అబద్ధాలు చెప్పే ప్రధానిని చూడటం మాత్రం ఇదే […]

 Authored By ramu | The Telugu News | Updated on :28 April 2024,3:00 pm

Priyanka Gandhi  : ప్ర‌స్తుతం ఎక్కడ చూసిన కూడా ఎన్నిక‌ల హంగామా న‌డుస్తుంది. ఒక‌రిపై ఒక‌రు దుమ్మెత్తిపోసుకుంటూ ర‌చ్చ చేస్తున్నారు. స్టేట్‌లోనే కాదు సెంట్ర‌ల్‌లో కూడా రాజ‌కీయం మ‌రింత రంజుగా మారింది.తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది. దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన ప్రధానులతో పాటు ఎందరో ప్రధానులను తాను చూశానని, కానీ బహిరంగంగా పచ్చి అబద్ధాలు చెప్పే ప్రధానిని చూడటం మాత్రం ఇదే మొదటిసారని ఆమె చెప్పుకొచ్చారు.. ”సంపద పంపిణీ” హామీ పేరుతో కాంగ్రెస్‌ పార్టీ మహిళల మంగళసూత్రాలు కూడా ఊడలాక్కుంటుందంటూ మోదీ అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆమె మండిప‌డ్డారు.

, కాంగ్రెస్ మేనిఫెస్టో చూసి భయంతోనే ఆయన ఇలాంటి ఆరోపణలకు దిగుతున్నారని తప్పుపట్టారు. సంపద పునఃపంపిణీపై విమర్శలు చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీని .. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ లో ఒక మూలన కూర్చుని అర్థంపర్థం లేని మాటలు మాట్లాడే అంకుల్ తో పోల్చారు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ప్రియాంక గాంధీ . ఆ మాటలు పట్టించుకోవద్దని, అలాంటి హాస్యాస్పద మాటలను విని నవ్వుకోవాలని ఓటర్లకు సూచించారు. ‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీ నగలు, మంగళసూత్రం దొంగిలించి వేరొకరికి ఇస్తుంది అని మోదీ అంటున్నారు. ఈ అర్థం లేని మాటలు విన్న తరువాత.. ఏం చేయాలి.. కాసేపు నవ్వుకోవాలి’’ అని ప్రియాంక వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

Priyanka Gandhi మోదీని అంకుల్ అంటూ ప్రియాంక గాంధీ ప‌వ‌ర్ పంచ్‌లు మాములు న‌వ్వురాదు

Priyanka Gandhi : మోదీని అంకుల్ అంటూ ప్రియాంక గాంధీ ప‌వ‌ర్ పంచ్‌లు.. మాములు న‌వ్వురాదు..!

ప్రధాని హోదాలో ఉన్నాను కాబట్టి.. నేను ఏం మాట్లాడినా.. ఎంత అర్థంపర్థం లేకుండా మాట్లాడినా ప్రజలు నమ్ముతారని ఆయ‌న భావిస్తున్నారు అని ప్రియాంక గాంధీ విమర్శించారు. ‘‘కాంగ్రెస్ పార్టీ ఎక్స్ రే యంత్రంతో ప్రజల ఇళ్లలోకి ప్రవేశించి సోదాలు చేస్తుందని, ఆ తర్వాత మీ నగలతో పాటు భద్రపరిచిన మంగళసూత్రాన్ని కూడా లాక్కుని ఇతరులకు ఇస్తుందని ప్రధాని ప్రజలను హెచ్చరిస్తున్నారు. అది సాధ్యమేనా? అంత అర్థం లేకుండా ఎవరైనా మాట్లాడుతారా? ఓటమి భయంతోనే ఆయన ఇలా మాట్లాడుతున్నారా?’’ అని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. మోదీ పాలనలో నిత్యావసరాల ధరలు పెరగడాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘ఆయన ఖరీదైన మనిషి’’ అని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది