Home » National » Untold Secrets About Crows
National

Crows : కాకుల గురించి ఎవ్వరికీ తెలియని రహస్యాలు

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: June 2, 2025, 12:30 pm
Advertisement

Crows : కాకి అంటే అందరికీ గుర్తుకు వచ్చేది పిండప్రదానం. అంతే కాకుండా కాకులను పూర్వీకులతో కూడా పోలుస్తారు. అవి ఇంటి ముందుకు వస్తే చాలు చనిపోయిన పూర్వీకులు ఇంటికి వచ్చారని నమ్మి వాటికి అన్నం పెడుతుంటారు. ఇక చనిపోయిన తర్వాత మూడో రోజు, ఐదవ రోజు, తొమ్మిదవ రోజు , చనిపోయిన తమ బంధువు కాకి రూపంలో వస్తారని పిండ ప్రధానం చేస్తారు. ఒకవేళ అది కాకి ముట్టకపోతే, చనిపోయిన వారి ఆత్మ శాంతించలేదు, వారు ఏదో బాధపడుతున్నారని అనుకుంటాం.

Advertisement

Crows : కాకుల గురించి ఎవ్వరికీ తెలియని రహస్యాలు

ఇక భూమి మీద పుట్టిన ఏ జీవి అయినా సరే మరణిస్తుంటుంది. అయితే మీరు ఎప్పుడైనా కాకి చనిపోవడం గురించి విన్నారా? అసలు అవి చనిపోతాయా? వాటి గురించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం

Advertisement

పురాణాల ప్రకారం రావణుడికి భయపడి దేవతలంతా ఒక్కో జంతువులలోకి ప‌రకాయ ప్ర‌వేశం చేస్తారు. తొండలోకి కేబేరుడు, జింక‌లోకి ఇంద్రుడు, నెమలిలోకి వరుణుడు, కాకిలోకి యముడు ప్రవేశిస్తారంట. అయితే రావణడు వెళ్లిపోయాక ఆ జంతువుల నుంచి వీళ్లందరూ బయటకు వచ్చి వాటికి వరాలిస్తారు.

అందులో భాగంగానే యముడు కాకి కూడా ఓ వరం ఇచ్చాడంట. అది కాకి బలవర్మణం తప్ప స్వతహాగా దానంతట అది చనిపోదు. కాకికి మరణం ఉండదంటూ వరమిస్తాడంట. అంతే కాకుండా కాకులకు ఎవరైతే పిండం పెడతారో, కాకి ఎవరిపిండం అయితే తింటుందో వారికి నరక బాధలనుంచి విముక్తి కలుగుతుందని చెప్తాడంట.అలా కాకులకు పిండప్రదానం చేస్తారు.

Advertisement

కాకులు చాలా తెలివైనవి. రద్దీగా ఉండే కూడళ్లలో కాకులు గింజలు వేయడం, ఆపై కార్లు వాటిపైకి వెళ్లి వాటిని పగులగొట్టడం కోసం వేచి ఉండటం గమనించబడింది. అయితే అంతే కాదు, ఈ కాకులు నిజానికి లైట్ ఎరుపు రంగులోకి మారడానికి వేచి ఉండటం కనిపించింది. లైట్ ఆకుపచ్చగా మారినప్పుడు అవి ఎగిరిపోతాయి, తర్వాత తదుపరి ఎరుపు లైట్ వద్ద కొత్తగా పగిలిన గింజను పొందడానికి తిరిగి ఎగురుతాయి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి