America : ప్రపంచ చరిత్ర లో అద్దిరిపోయే మిషన్ చేసిన అమెరికా .. ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

America : ప్రపంచ చరిత్ర లో అద్దిరిపోయే మిషన్ చేసిన అమెరికా .. !

 Authored By siddhu | The Telugu News | Updated on :6 April 2026,9:30 pm

ప్రధానాంశాలు:

  •  America : ప్రపంచ చరిత్ర లో అద్దిరిపోయే మిషన్ చేసిన అమెరికా .. !

America  : అగ్రరాజ్యం అమెరికా అంటేనే ప్రపంచానికి ఒక ప్రత్యేకమైన గౌరవం. తమ దేశానికి చెందిన ఒక్క వ్యక్తి ప్రాణాలకు ముప్పు వచ్చినా సరే ఆ దేశం ఎంత దూరమైనా వెళ్తుంది అనడానికి తాజా సంఘటన ఒక పెద్ద ఉదాహరణగా నిలుస్తోంది. ఇటీవల ఇరాన్ గడ్డపై కూలిన అమెరికా యుద్ధ విమానంలోని పైలట్‌ను కాపాడేందుకు అమెరికా చేపట్టిన భారీ రెస్క్యూ ఆపరేషన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మామూలుగా అయితే ఇతర దేశాలు యుద్ధ విమానం పోయినా పర్వాలేదు కానీ మరో నలుగురి ప్రాణాలు రిస్క్ లో పెట్టకూడదు అని ఆలోచిస్తాయి. కానీ అమెరికా మాత్రం తమ పైలట్ కోసం ఏకంగా వందల సంఖ్యలో స్పెషల్ ఫోర్స్ దళాలను డజన్ల కొద్దీ ఫైటర్ జెట్లను ఇరాన్ గగనతలం మీదికి పంపి తన పవర్ ఏంటో చూపించింది.

America ప్రపంచ చరిత్ర లో అద్దిరిపోయే మిషన్ చేసిన అమెరికా

America : ప్రపంచ చరిత్ర లో అద్దిరిపోయే మిషన్ చేసిన అమెరికా .. !

America : శత్రువుల మధ్య ప్రాణాలతో పోరాటం

ఒక ఫైటర్ జెట్ ఇరాన్ సరిహద్దుల్లో కూలిపోయినప్పుడు అందులోని ఇద్దరు పైలట్లు ప్రాణాలతో బయటపడ్డారు. ఒకరిని అప్పటికప్పుడు రక్షించినా మరొక పైలట్ మాత్రం ఇరాన్ లోని అత్యంత కఠినమైన భౌగోళిక పరిస్థితుల మధ్య చిక్కుకుపోయాడు. ఇరాన్ గిరిజన తెగలు ఐఆర్ జీసీ దళాలు మరియు బసీజ్ ఫోర్స్ ఆ పైలట్ కోసం వేట మొదలుపెట్టాయి. ఆ సమయంలో ఆ పైలట్ ఏడు వేల అడుగుల ఎత్తులో ఉన్న ఒక పర్వతం వద్ద రాయి వెనుక దాక్కుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం గడిపాడు. అతని దగ్గర కేవలం ఒక కమ్యూనికేషన్ పరికరం మాత్రమే ఉంది. అమెరికా మిలిటరీ మాత్రం అతడికి ఎప్పటికప్పుడు ధైర్యం చెబుతూ బేకన్ పరికరాన్ని వాడొద్దని హెచ్చరించింది. ఎందుకంటే ఆ సంకేతాల ద్వారా ఇరాన్ దళాలు అతడ్ని పట్టుకునే ప్రమాదం ఉందని గ్రహించింది.

America  : ధైర్య సాహసాలతో కూడిన భారీ ఆపరేషన్

సీఐఏ ఇచ్చిన సమాచారం మేరకు పెంటగాన్ ఈ భారీ ఆపరేషన్ ప్లాన్ చేసింది. అమెరికా పైలట్ సమీపంలోకి ఇరాన్ దళాలు చేరుకుంటున్న సమయంలో అమెరికా యుద్ధ విమానాలు రంగంలోకి దిగి బాంబుల వర్షం కురిపించాయి. శత్రు దళాలను భయపెట్టి పైలట్ కు దగ్గరగా రానివ్వకుండా అడ్డుకున్నాయి. అదే సమయంలో ఆరుగురు సభ్యులతో కూడిన నేవీ సీల్ బృందం నేరుగా ఇరాన్ భూభాగంలోకి దూకింది. ప్రాణాలకు తెగించి ఆ పైలట్‌ను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. రక్షించిన వెంటనే అతడిని చికిత్స కోసం కువైట్‌కు తరలించారు. ఈ విషయాన్ని డోనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా ధ్రువీకరించారు.

America  : భారీ మూల్యం చెల్లించినా తగ్గని మొండితనం

ఈ ఆపరేషన్ ప్రపంచ చరిత్రలోనే ఒక సంచలనం అని చెప్పాలి. ఎందుకంటే ఒక్క పైలట్ ప్రాణం కోసం అమెరికా ఇరాన్ గడ్డపై యుద్ధం లాంటి పరిస్థితిని సృష్టించింది. అయితే ఈ ఆపరేషన్ లో తాము అమెరికాకు చెందిన సి-130 విమానంతో పాటు రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లను కూల్చివేసినట్లు ఇరాన్ ఆర్మీ ప్రకటించింది. ఆస్తి నష్టం జరిగినా సరే తమ సైనికుడి ప్రాణం తమకు ముఖ్యమని అమెరికా చాటిచెప్పింది. ఏ దేశమైనా సరే తమ పౌరుడి కోసం ఇంత సాహసం చేస్తుందా అంటే కచ్చితంగా లేదనే చెప్పాలి. అందుకే ఈ మిషన్ అమెరికా చరిత్రలో ఒక అద్దిరిపోయే రెస్క్యూ ఆపరేషన్‌గా మిగిలిపోయింది. తన దేశ సైనికుల పట్ల అమెరికాకు ఉండే ఆ చిత్తశుద్ధి చూసి ప్రపంచమంతా ముక్కున వేలేసుకుంటోంది.

 

siddhu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది