Raymond Family Disputes : రేమండ్ ఫ్యామిలీలో ఉన్న గొడవలు ఏంటి? కోట్ల ఆస్తి ఇచ్చిన తల్లిదండ్రులను ఎందుకు గౌతమ్ సింఘానియా బయటికి నెట్టేశాడు? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Raymond Family Disputes : రేమండ్ ఫ్యామిలీలో ఉన్న గొడవలు ఏంటి? కోట్ల ఆస్తి ఇచ్చిన తల్లిదండ్రులను ఎందుకు గౌతమ్ సింఘానియా బయటికి నెట్టేశాడు?

Raymond Family Disputes : రేమండ్ అనగానే మనకు గుర్తొచ్చేది.. ప్యాంట్లు, షర్టులు. ఇప్పుడంటే జీన్స్, టీషర్టులు గట్రా వచ్చాయి కానీ.. ఒకప్పుడు ఫార్మల్ డ్రెస్సులు అంటేనే మనకు గుర్తొచ్చేది రేమండ్. అవును.. రేమండ్ క్లాత్ కు ఉన్న డిమాండే వేరు. ఇంత రెడీమెడ్ రంగం శాసిస్తున్న రోజుల్లోనూ రేమండ్ టెక్స్ టైల్ కంపెనీ ఇప్పటికీ టెక్స్ టైల్ రంగంలో నెంబర్ వన్ గానే ఉంది. సూట్స్ అంటేనే మనకు గుర్తొచ్చేది రేమండ్. ప్రపంచవ్యాప్తంగా 200 నగరాల్లో, […]

 Authored By kranthi | The Telugu News | Updated on :28 December 2023,9:00 am

ప్రధానాంశాలు:

  •  ప్రపంచవ్యాప్తంగా 200 నగరాల్లో విస్తరించిన రేమండ్

  •  ప్రపంచవ్యాప్తంగా 637 స్టోర్స్

  •  4000 మల్టీ బ్రాండ్ ఔట్ లెట్స్

Raymond Family Disputes : రేమండ్ అనగానే మనకు గుర్తొచ్చేది.. ప్యాంట్లు, షర్టులు. ఇప్పుడంటే జీన్స్, టీషర్టులు గట్రా వచ్చాయి కానీ.. ఒకప్పుడు ఫార్మల్ డ్రెస్సులు అంటేనే మనకు గుర్తొచ్చేది రేమండ్. అవును.. రేమండ్ క్లాత్ కు ఉన్న డిమాండే వేరు. ఇంత రెడీమెడ్ రంగం శాసిస్తున్న రోజుల్లోనూ రేమండ్ టెక్స్ టైల్ కంపెనీ ఇప్పటికీ టెక్స్ టైల్ రంగంలో నెంబర్ వన్ గానే ఉంది. సూట్స్ అంటేనే మనకు గుర్తొచ్చేది రేమండ్. ప్రపంచవ్యాప్తంగా 200 నగరాల్లో, 637 స్టోర్స్ లో, 4000 మల్టీ బ్రాండ్ ఔట్ లెట్స్, 55 దేశాల్లో ప్రొడక్షన్ యూనిట్స్.. ఇలా మొత్తంగా కొన్ని బిలియన్ డాలర్ల మార్కెట్ ను సొంతం చేసుకుంది రేమండ్ కంపెనీ. ఇప్పటికీ వేల కోట్ల లాభాలతో టెక్స్ టైల్ ఇండస్ట్రీని రూల్ చేస్తోంది రేమండ్.

అసలు రేమండ్ కంపెనీ స్థాపన వెనుక, కంపెనీ సక్సెస్ వెనుక ఉన్నది ఎవరో తెలుసా? విజయ్ పత్ సింఘానియా. ఆ తర్వాత రేమండ్ ను అంచెలంచెలుగా ఎదిగేలా చేసింది ఆయన కొడుకు గౌతమ్ సింఘానియా. అయితే.. విజయ్ పత్ సింఘానియా.. గౌతమ్ కు కోట్ల ఆస్తి ఇచ్చాడు. కంపెనీని కొడుకు చేతుల్లో పెట్టాడు. కంపెనీని అయితే కొడుకు వృద్ధిలోకి తీసుకొచ్చాడు కానీ.. తల్లిదండ్రులను మాత్రం పట్టించుకోలేదు. తల్లిదండ్రులను రోడ్డు మీద వదిలేశాడు. దీంతో తన కొడుకు మీద కేసు వేసిన విజయ్ పత్.. ప్రస్తుతం కోర్టులో పోరాడుతున్నాడు.

Raymond Family Disputes : కోర్టుకెక్కిన గౌతమ్ భార్య

ఇదిలా ఉంటే.. గౌతమ్ భార్య కూడా కోర్టుకెక్కింది. తండ్రిని కొడుకు బయటికి నెట్టేయడంతో.. అది నచ్చని గౌతమ్ భార్య.. తనకు విడాకులు కావాలని కోర్టుకెక్కింది. అయితే.. విజయ్ పత్ కు మరో కొడుకు కూడా ఉన్నాడు. కానీ.. ఆస్తుల గొడవ వల్ల.. పెద్ద కొడుకు విదేశాలకు వెళ్లిపోవడంతో గౌతమ్ కే అన్నీ దక్కాయి. ఆ తర్వాత విజయ్ పత్ రిటైర్ అయ్యారు. ముంబైలో జేకే హౌస్ పేరుతో పెద్ద బిల్డింగ్ ను నిర్మించుకున్నాడు. అందులో ఒక ఫ్లాట్ లో విజయ్ పత్, మరో ఫ్లాట్ లో గౌతమ్, ఇంకో ఫ్లాట్ లో విజయ్ పత్ సోదరుడు, ఆయన పిల్లలు ఉండేవారు. అయితే.. ఆ ఇంట్లో ఉన్న మొత్తం నాలుగు డుప్లెక్స్ హౌసులు తనకు ఇచ్చేయాలని గౌతమ్ తన తండ్రిని అడిగాడు. దీంతో కుదరదని విజయ్ పత్ చెప్పడంతో తన తండ్రి మీదనే ఆరోపణలు చేసి తల్లిదండ్రులను బయటికి పంపించేశాడు. అందులో ఉండే బంధువులను కూడా ఖాళీ చేయించాడు. దీంతో విజయ్ పత్ వేరే ఇంట్లో రెంట్ కు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. వేల కోట్లు సంపాదించి.. ఇప్పుడు ముంబైలో ఒక సాధారణ జీవితం గడుపుతున్నాడు.

Also read

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది