Omicron Covid Cases : దేశంలో కరోనా ఉద్ధృతి.. విజృంభిస్తున్న ఒమిక్రాన్.. రికార్డు స్థాయిలో కేసులు..!
Omicron Covid Cases : దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ శరవేగంగా విస్తరిస్తూ గజ గజ లాడిస్తోంది. భారత్‌లో ఓ వైపు కరోనా.. మరోవైపు ఒమిక్రాన్ కేసుల పెరుగుదల కలవరపెడుతోంది. ఆ మధ్య కాస్త తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. గత రెండు మూడు రోజులుగా విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులు చూస్తూ మూడో వేవ్ కి ఇదే ప్రారంభమని అంటున్నారు. తాజాగా 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్త కేసుల సంఖ్య ఏకంగా 33 వేల 750కి పైగా నమోదు కాగా.. 123 మంది మరణించడం ఆందోళనకు గురిచేస్తోంది.
తాజాగా 10, 846 మంది మహమ్మారి భారీ నుంచి కోలుకోగా… దేశంలో ప్రస్తుతం 1,45,582 యాక్టిివ్ కేసులు ఉన్నాయి. ఇక దేశంలో కొత్తగా 123 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. దీంతో దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1700 వందల మార్క్ ను దాటింది. అధిక శాతం కేసులు మహరాష్ట్ర (500) లో వెలుగు చూశాయి.
అయితే ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటివరకైతే ప్రమాదం కాదని కేంద్ర వైద్యారోగ్య శాఖ చెబుతోంది. ఒమిక్రాన్ భారిన పడ్డ బాధితులకు… జలుబు, జ్వరం వంటి సాధారణ ఆరోగ్య సమస్యలు ఉండి త్వరగా కోలుకుంటున్నట్లు పేర్కొంటున్నారు. అయినప్పటికీ ప్రతీ ఒక్కరూ మాస్క్, శానిటైజర్, భౌతికదూరం వంటి నియమాలను తప్పక పాటించాలని సూచిస్తున్నారు.