Today Gold Rates : బంగారం పేరు వింటేనే పేద, మధ్య తరగతి ప్రజల్లో వణుకు వస్తోంది. ఎందుకంటే.. బంగారం ధరలు ప్రస్తుతం అంతలా ఆకాశాన్ని అంటాయి. అయితే.. ఒకప్పుడు బంగారం ధరలు అంటే పెరగడంతో పాటు తగ్గుతూ ఉండేవి. కానీ.. ఇప్పుడు బంగారం ధరలు అంటే పెరగడమే కానీ.. తగ్గడం మాత్రం లేదు. నేటి శుభకార్యాల్లో బంగారం కొనాలంటేనే భయపడుతున్నారు జనాలు. ఒకప్పుడు శుభకార్యం అంటే బంగారం కొనడానికి ఏమాత్రం వెనకాడని జనాలు.. ప్రస్తుతం బంగారం ధర మార్క్ తులానికి 50 వేలు క్రాస్ కావడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇటీవల కూడా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతూ వచ్చాయి. తాజాగా ఇవాళ కూడా బంగారం ధరలు పెరిగాయి. మరి ఇవాళ బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి.
దేశవ్యాప్తంగా ఒక గ్రాము బంగారం 22 క్యారెట్లకు రూ.4750గా ఉంది. 10 గ్రాములకు రూ.47500గా ఉంది. అంటే.. ఒక గ్రాముకు ఈరోజు 10 రూపాయలు పెరిగింది. ఒక గ్రాము బంగారం 22 క్యారెట్లకు ధర నిన్న రూ.4740గా ఉండేది. నిన్న 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.47,400గా ఉండేది. 10 గ్రాములకు రూ.100 పెరిగింది. ఇక.. 24 క్యారెట్ల బంగారం ఒక గ్రాముకు రూ.5181 గా ఉంది. నిన్న ఒక గ్రాము బంగారం ధర రూ.5171గా ఉండేది. అంటే.. గ్రాము బంగారం ధర రూ.10 పెరిగింది. 10 గ్రాములకు 24 క్యారెట్ల బంగారం ధర రూ.51810గా ఉంది. 24 క్యారెట్లకు రూ.51,710గా నిన్న ఉండేది. అంటే 10 గ్రాములకు రూ.100 పెరిగింది.
ఇక.. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్లకు రూ.47,500గా ఉంది. 24 క్యారెట్లకు రూ.51,810గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్లకు రూ.48,590గా ఉంది. 24 క్యారెట్లకు రూ.53,000గా ఉంది. ముంబైలో 22 క్యారెట్లకు రూ.47,500గా ఉండగా.. 24 క్యారెట్లకు రూ.51,810గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్లకు రూ.47,500 కాగా.. 24 క్యారెట్లకు రూ.51,810గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్లకు రూ.47,500 కాగా.. 24 క్యారెట్లకు రూ.51,810గా ఉంది.
ఇక.. తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే.. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,500 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,810 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,500 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,810 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,500 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,890గా ఉంది.
మరోవైపు వెండి ధర దేశవ్యాప్తంగా స్థిరంగా ఉన్నాయి. నిన్నటి ధరకే ఇవాళ కూడా వెండి లభిస్తోంది. మొన్న అంటే మే 8 నుంచి వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఒక గ్రాము వెండి ధర.. రూ.62.50 గా ఉంది. 10 గ్రాములకు రూ.625, కిలో వెండి ధర రూ.62,500 గా ఉంది. ఢిల్లీ, ముంబై, కోల్ కతాలో 10 గ్రాముల వెండి ధర రూ.625 కాగా.. కిలో వెండి ధర రూ.62500గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో 10 గ్రాముల వెండి ధర రూ.665 కాగా… కిలో వెండి ధర రూ.66500గా ఉంది. విజయవాడ, విశాఖపట్టణంలోనూ అదే ధర ఉంది.
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 లో రోజులు గడుస్తున్నా కొద్దీ టాస్కులు టఫ్…
Tirumala Laddu Prasadam : కలియువ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఏడు కొండల పుణ్యక్షేత్రానికి చాలా విశిష్తత ఉంది.…
Flipkart Big Billon Days Sale 2024 : ఫ్లిప్ కార్ట్ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024…
Balineni Srinivasa Reddy : ఏపీలో ప్రస్తుతం పరిస్థితులు ఎంతగా మారుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. వైసీపీ పార్టీ నాయకులు…
Pushpa 2 : సుకుమార్- అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో రూపొందిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో…
Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో హామీని నెరవేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…
Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…
TDP Alliance ఆంధ్రప్రదేశ్లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…
This website uses cookies.