102 Year Old Woman : ఈ బామ్మ వయసు 102.. ఇన్నాళ్లు ఆమె ఆరోగ్యంగా జీవించడానికి కారణం అదొక్కటేనట
102 Year Old Woman : 102 ఏళ్ల వరకు ఎవరైనా బతుకుతారా? అంతెందుకు.. 70 ఏళ్లు రాగానే ఎప్పుడు పుటుక్కుమంటామో తెలియదు. అలాంటిది ఓ బామ్మ 102 ఏళ్లు బతికింది. ఇంకా తను ఆరోగ్యంగానే ఉంది. తనది ఇంగ్లాండ్ లోని కోవెంట్రీ. ఇటీవల తను తన 102 వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంది. వందేళ్లు దాటిన ఈ బామ్మ ఇప్పటికీ ఆరోగ్యంగా ఉండటం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇప్పటికీ తన కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటోంది. ఈ వయసులో కూడా తను సాండ్ విచ్, బిస్కెట్లు, కేక్స్ తింటూ ఇంట్లో వాళ్లతో సరదాగా ఎంజాయ్ చేసింది తన బర్త్ డే పార్టీ రోజు. తన పేరు డోరతీ డోనెగాన్. నా జీవితమంతా చాలా ఎంజాయ్ చేశా. నాది మంచి లైఫే. నిజానికి మాది పెద్ద ఫ్యామిలీ. నాకు మంచి అమ్మానాన్న దొరికారు. చిన్నప్పుడు వాళ్లతో సరదాగా ఆడుకునేదాన్ని.. అంటూ తన చిన్ననాటి మెమోరీస్ ను గుర్తు చేసుకుంది డోరతీ.
తను గెరాల్డ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. తన భర్తతో 53 ఏళ్ల పాటు కలిసి జీవించిన తర్వాత తన భర్తను కోల్పోయింది డోరతీ. తనకు కొడుకు పుట్టేవరకు స్టాండర్ట్ మోటర్ కంపెనీలో పనిచేసింది. తన చిన్నతనంలోనే తన తమ్ముడిని కోల్పోయింది డోరతీ. ఇక.. డోరతీ రోజువారి జీవితం ఎలా ఉంటుందంటే.. సరదాగా మైండ్ ను రిలాక్స్ చేసుకోవడం కోసం బోర్డ్ గేమ్స్, వర్డ్ సెర్చెస్, మ్యాగజైన్లు చదువుతూ ఉంటుంది. టీవీల్లో క్విజ్ షోలు చూస్తుంది డోరతీ. అప్పుడప్పుడు ఒక గ్లాస్ వైన్ తాగడం డోరతికి అలవాటు. ప్రతి రోజు ఒక కేకు ముక్క, టీ, బిస్కట్లు తినడం తనకు ఇష్టం. నిజానికి చాయ్ తాగడం అంటే డోరతికి చాలా ఇష్టం.రోజూ వేడి వేడిగా ఒక కప్పు చాయ్ తాగుతుంటే తనకు అమృతం తాగినట్టుగా అనిపిస్తుందట. ఏదో పని గట్టుకొని.. కావాలని అది తినాలి.. ఇది తినొద్దు కాదు..
102 year old woman : తన రోజువారి జీవితం ఎలా గడుపుతుందంటే?
జస్ట్ లైఫ్ లో అలా మనకు దొరికిన దాన్ని చేజిక్కించుకుంటూ ముందుకెళ్లిపోవాలి. ఏ కాలంలో ఏ ఆహారం దొరికితే దాన్ని తినాలి. దేవుడు మనకు ఏది ఇస్తే అదే మన జీవితం.. నేను ఎక్కువ సంవత్సరాలు బతకడానికి దోహదపడింది అదే అంటూ డోరతి చెప్పుకొచ్చారు. అయితే.. తను ఏది తిన్నా చాలా లిమిటెడ్ గా తినడం, ప్రతి చిన్న విషయానికి ఓవర్ రియాక్ట్ కాకపోవడం, ఎక్కువ ఆకుకూరలు తీసుకోవడం, వ్యాయామం చేయడం, తక్కువ మోతాదులో ఆల్కాహాల్ తీసుకోవడం వల్ల తను ఇన్ని ఏళ్లు బతికినట్టుగా తన లైఫ్ సీక్రెట్ ను అందరితో తన 102 వ బర్త్ డే సందర్భంగా చెప్పుకొచ్చింది. అంటే.. మన లైఫ్ స్టయిల్ ను మనమే తీర్చిదిద్దుకొని ఏదైనా లిమిటెడ్ గా తీసుకుంటూ లైఫ్ ఎంజాయ్ చేస్తూ పోతే.. ఎక్కువ రోజులు బతికే అవకాశం ఉందని.. ఆయుష్షును మనమే పెంచుకోవచ్చని ఈ బామ్మను చూసి నేర్చుకోవచ్చు.