Best Scheme : ఈ పథకంలో తక్కువ పొదుపుతో.. ఏకంగా 14 లక్షల రాబడిని పొందండి ఇలా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Best Scheme : ఈ పథకంలో తక్కువ పొదుపుతో.. ఏకంగా 14 లక్షల రాబడిని పొందండి ఇలా..!

 Authored By prabhas | The Telugu News | Updated on :7 November 2022,9:40 pm

Best Scheme : ప్రస్తుతం చాలామంది సంపాదించిన డబ్బును పొదుపు చేయాలని ఆలోచిస్తున్నారు. చాలామంది పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ లో డబ్బులు పొదుపు చేస్తూ ఉంటారు. లేదంటే ఏదైనా బ్యాంకు పథకాలలో డబ్బులు దాచి పెడుతూ ఉంటారు. అయితే వీటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే తక్కువ రాబడి వస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకుల్లో ఏడు శాతం వరకు వడ్డీ లభిస్తుంది. ఈ వడ్డీ రేటు ప్రాతిపదికన చూస్తే డబ్బులు రెట్టింపు కావాలంటే ఏకంగా పదేళ్లకు పైన పడుతుంది. ఇలా కాకుండా ఐదేళ్ళలోనే డబ్బులను రెట్టింపు చేసే పథకాలు కూడా కొన్ని ఉన్నాయి. అయితే వీటిల్లో కొద్దిగా రిస్క్ ఉంటుంది.

మ్యూచువల్ ఫండ్స్ కు చెందని ఈక్విటీ స్కీమ్స్ లో అధిక రాబడి పొందవచ్చు. ఈ స్కీమ్స్ మార్కెట్ రిస్కుకు లోబడి ఉంటాయి. అందువల్ల డబ్బులు పెట్టేవారు రిస్క్ ఉంటుందని గుర్తుంచుకోవాలి. అయితే దీర్ఘకాలంలో మంచి రాబడి పొందవచ్చు అని నిపుణులు అంటున్నారు. ఐదేళ్ల కాలంలో అధిక రాబడి అందించిన కొన్ని మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ గురించి తెలుసుకుందాం. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ టెక్నాలజీ ఫండ్ ఐదేళ్ల రాబడి 26% పైగా ఉంది. అంటే ఐదేళ్ల కిందట ఈ ఫండ్ లో లక్ష పెట్టి ఉంటే ఇప్పుడు 3.21 లక్షలు వచ్చేవి. అదే నెలకు పదివేలు సిప్ చేసి ఉంటే 14 లక్షలు పైగా వచేవి. టాటా డిజిటల్ ఇండియా ఫండ్ రెగ్యులర్ స్కీం లో భారీ రాబడి పొందవచ్చు.

14 lakh income in this scheme with low savings

14 lakh income in this scheme with low savings

ఈ రాబడి 25 శాతానికి పైగా ఉంది. అంటే లక్ష పొదుపు చేసి ఉంటే ఇప్పుడు 3.13 లక్షలు వచ్చేవి. అంటే నెలకు పదివేలు పెడుతూ వచ్చి ఉంటే ఇప్పుడు 13.79 లక్షలు వచ్చేవి. ఎస్బిఐ టెక్నాలజీ ఆపర్చునిటీస్ ఫండ్ కూడా ఉంది. ఫండ్ ఐదేళ్ల రాబడి 24% గా ఉంది. అంటే ఐదేళ్ల కిందట ఈ ఫండ్ లక్ష పెట్టి ఉంటే ఇప్పుడు మూడు లక్షలు వచ్చేవి. నెలకు పదివేలు పెడుతూ వచ్చి ఉంటే ఇప్పుడు 13.5 లక్షలు వచ్చేవి. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ డిజిటల్ ఇండియా ఫండ్ కూడా ఉంది. దీని ఐదేళ్ల రాబడి 24.71% అంటే ఐదేళ్ల కిందట ఈ ఫండ్ లో లక్ష పెట్టి ఉంటే ఇప్పుడు 3.1 లక్షలు వచ్చేవి. అదే సిప్ చేసి ఉంటే ఇప్పుడు 13.7 లక్షలు లభించేవి.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది