కొడుకు మృతదేహాన్ని తరలించడానికి డబ్బులు లేక బస్సులో 140 కిలోమీటర్ల ప్రయాణం..!!
చనిపోయిన కొడుకు మృతదేహాన్ని అంబులెన్స్ లో తరలించలేక ఓ తండ్రి సంచిలో పెట్టుకుని సుమారు 140 కిలోమీటర్లు బస్సులోనే ప్రయాణించాడు. ఇటువంటి దారుణమైన ఘటన మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో చోటు చేసుకోవడం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే… డిండౌరి జిల్లా సహజ్ ఊరికి చెందిన సునీల్ దుర్వే భార్య జమ్నీ భాయ్…కి పురిటి నొప్పులు రావడంతో ప్రస్తుతం జిల్లా ఆసుపత్రికి తీసుకువచ్చారు. జూన్ 13న ఆసుపత్రిలో ఓ మగ శిశువుకు… ఆమె జన్మనిచ్చింది.
అయితే శిశువు ఊపిరి తీసుకోవటంలో ఇబ్బంది పడటంతో జబల్ పూర్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి పంపారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ శిశువు జూన్ 15న మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలపడం జరిగింది. మృతదేహాని స్వగ్రామానికి తరలించడానికి అంబులెన్స్ సమకూర్చాలని అభ్యర్థించిన ఆసుపత్రి సిబ్బంది స్పందించలేదు. ప్రైవేట్ అంబులెన్స్ కోసం ప్రయత్నించగా డబ్బులు భారీగా డిమాండ్ చేయటంతో… డబ్బులు లేకపోవడంతో మృతదేహాన్ని చేతి సంచిలో వేసుకుని బస్సు ఎక్కాల్సి వచ్చిందని… తండ్రి సునీల్ ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే ఆసుపత్రి వర్గాలు వేరే వాదన వినిపిస్తున్నాయి. డిశ్చార్జి చేసే సమయంలో శిశువు బతికే ఉందని వైద్యుల వాదన. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న శిశువుకు చికిత్స అందజేస్తుండగానే… డిశ్చార్జ్ చేయమని పట్టుబట్టారని చెప్పారు.