Home » Andhra Pradesh » 15 Theaters Seized In Ap Krishna District
andhra pradesh

Krishna : కృష్ణా జిల్లాలో 15 థియేటర్లు సీజ్..!

Authored By
Inesh A
The Telugu News | Published on: December 23, 2021, 12:45 pm
Advertisement

ఏపీలోని కృష్ణా జిల్లాలో థియేటర్ల తనిఖీల్లో భాగంగా అధికారులు 15 థియేటర్లను సీజ్ చేశారు. అధిక రేట్లకు టికెట్ల విక్రయం, ఫైర్ సేఫ్టీ సదుపాయాలు సరిగ్గా లేకపోవడంతో పాటు కోవిడ్ నిబంధనలు పాటించని కారణంగా ఆయా థియేటర్లను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.

Advertisement

కొన్ని థియేటర్లలో టికెట్ల రేట్ల కంటే.. తినుబండారాల రేట్లు విపరీతంగా పెంచేశారన్న విషయాన్ని గుర్తు చేస్తూ.. త్వరలో వాటి రేట్లను కూడా నియంత్రించే చర్యలు చేపడుతామన్నారు. ఏపీ ప్రభుత్వం గతంలో టికెట్ల రేట్లపై ఇచ్చిన జీవో 35ను కోర్టులో కొట్టేయడంతో అంతకు ముందు రేట్ల అమలుపై దృష్టి పెట్టామన్నారు.

15 theaters seized in ap krishna district

Advertisement

పెద్ద సినిమాల విడుదల సమయంలో టికెట్‌ రేట్లను పెంచుకోవాలంటే.. ముందుగా తమకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలని హెచ్చరించారు. త్వరలోనే జిల్లా వ్యాప్తంగా మల్టీఫ్లెక్స్‌లతో పాటు అన్ని థియేటర్లకు ఫిక్స్‌డ్‌ రేట్లు నిర్ణయించి బోర్డులు పెడతామని పేర్కొన్నారు.

Inesh A

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి