Home » Exclusive » 2022 January 06 Today Gold Rates In Telugu States
Exclusive

Today Gold Rates : మహిళలకు తీపికబురు.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. నేటి ధరలివే..!

Authored By
Breaking News 2
The Telugu News | Updated on: January 6, 2022, 8:17 am
Advertisement

Today Gold Rates : నూతన ఏడాది ప్రారంభమవుతూనే పెరిగిన బంగారం ధరల్లో.. వరుసగా మూడు రోజులు ఎలాంటి తగ్గింపు కనిపించలేదు. గత మూడు రోజులుగా పసిడి ధరలు నిలకడగా ఉండటమో లేదా స్వల్పంగా పెరగటమో జరిగింది. అయితే నిన్న మాత్రం బంగారం ధరల్లో భారీ మార్పు కనిపించి… నేడూ అదే కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధర ఇలా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47, 300గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51, 580గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47, 080గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49, 080గా ఉంది.

Advertisement

Today Gold Rates : తెలంగాణ రాజధాని హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45, 150గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49, 250గా ఉంది. ఇక ఏపీలోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45, 150గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49, 250గా ఉంది. ఇక వెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధరలు నిన్నటితో పోలిస్తే రూ. 400 పెరిగాయి. దీనితో మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ 66, 100గా ఉంది. హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.66, 100 గా ఉండగా… ఢిల్లీ, ముంబయిలలో రూ. 62, 300 గా ఉంది. కొత్త సంవత్సరంకు ముందు ఆ వారం రోజులు బంగారం ధరలు స్థిరంగానే ఉంటూ సరిగ్గా జనవరి 1 స్వల్పంగా పెరిగాయి.

2022 january 06 today gold rates in telugu states

Advertisement

Today Gold Rates :ఇక అది మొదలు వరుసగా మూడు రోజుల నుంచి బంగారం ధరల్లో పెరుగుదల కనిపించగా నిన్న భారీ తగ్గుదల నమోదు చేసుకుంది. బంగారం కొనే వారికి నేడు కాస్త ఊరట లభించే విధంగా ఉంది. అయితే బులియన్ మార్కెట్‌లో బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు హెచ్చుతగ్గులు నమోదవుతుంటాయి. నిమిషం నిమిషానికి.. మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి. భారీ మొత్తంలో కొనాలి అనుకునే వారు.. ఆ మేరకు ఎప్పటికప్పుడు ధరలను గమనిస్తూ బంగారాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి