Rabbit and Tortoise running race goes viral video
Viral Video : మీకు తాబేలు, కుందేలు స్టోరీ గుర్తుందా? చిన్నప్పుడు స్కూల్ లో చదువుకున్నాం కదా. తాబేలు, కుందేలు.. రెండు పరుగు పందెం పెట్టుకుంటాయి. అయితే.. తాబేలు చాలా నెమ్మదిగా నడిచే స్వభావం ఉన్న జీవి. కానీ.. కుందేలు మాత్రం వేగంగా పరిగెత్తగలదు. ఇటువంటి పోటీలో ఖచ్చితంగా కుందేలే గెలుస్తుంది అంటారు కదా. కానీ.. ఆ స్టోరీలో మాత్రం తాబేలు గెలుస్తుంది. కుందేలు.. తీరిగ్గా నిద్రపోతుంది. మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్న తాబేలు.. చివరకు విజయ తీరాలకు చేరుకుంటుంది. ఈ స్టోరీ నీతి ఏంటి అంటే.. స్టో అండ్ స్టడీ విన్స్ ద రేస్.
అంటే.. తొందరపడకుండా.. ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందడుగు వేస్తేనే విజయం మన సొంతం అవుతుంది అనే అర్థం వచ్చేలా ఆ స్టోరీని మనం చెప్పుకుంటాం.ఎక్కడన్నా.. తాబేలు గెలుస్తుందా? అదంతా ట్రాస్. అదంతా ఉత్త స్టోరీనే. కుందేలు ఎంత వేగంగా పరిగెడుతుంది. మనుషులకే దొరకదు. అటువంటిది.. తాబేలుతో జరిగిన పోటీలో అది ఓడిపోవడం ఏంటి.. అని అందరూ అనుకుంటారు. కానీ.. ఆ స్టోరీని వీళ్లు నిజం చేశారు. ఈ వీడియో చూస్తే.. చిన్నప్పుడు మనం చదువుకున్న ఆ స్టోరీ నిజమే అనిపిస్తుంది.
Rabbit and Tortoise running race goes viral video
తాజాగా ఓ వీడియో , లో వైరల్ అవుతోంది. అందులో తాబేలు, కుందేలుకు పరుగు పందెం పెట్టారు. ఈ పందెంలో కూడా తాబేలే గెలవడంతో అక్కడున్న వారంతా కేరింతలు కొడతారు. తాబేలుకు అభినందనలు తెలుపుతారు. అయితే.. తాబేలు కంటే కొంత దూరం ముందుగా పరిగెత్తిన కుందేలు.. ఆ తర్వాత ఆగుతుంది. అస్సలు ముందుకు వెళ్లదు. తీరా.. తాబేలు.. చివరకు చేరుకున్నాక.. అప్పుడు కుందేలు ముందుకు వస్తుంది. అప్పటికే తాబేలు గెలుస్తుంది. ఆ వీడియోను మీరు కూడా చూసేయండి మరి.
Ramen noodles | జపాన్‌లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్‌లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
This website uses cookies.