Home » Exclusive » 2022 January 10 Today Corona Updates In India
Exclusive

Today Corona Updates : బ్రేకింగ్… దేశంలో కరోనా థర్డ్ వేవ్.. ఒక్కరోజే 1,79,723 కేసులు..146 మరణాలు.!

Authored By
Inesh A
The Telugu News | Updated on: January 10, 2022, 9:37 am
Advertisement

Today Corona Updates : భారత్ లో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. ఒక వైపు ఒమిక్రాన్‌ కేసులు, మరో వైపు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్త కేసుల సంఖ్య ఏకంగా 1 లక్షా 79 వేల 723 కేసులు నమోదు కాగా.. 146 మంది మరణించడం ఆందోళనకు గురిచేస్తోంది.

Advertisement

ఇక డైలీ పాజిటివీటి రేటు 13.29 శాతంగా నమోదు చేసుకుంది. మరోవైపు రోజు వందల సంఖ్యలో ఒమిక్రాన్‌ కేసులు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4033 కు చేరుకుంది. అధిక శాతం కేసులు మహరాష్ట్ర చూశాయి. దేశంలో ఈ కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ శరవేగంగా విస్తరిస్తూ గజ గజ లాడిస్తోంది. మూడో వేవ్ కి ఇదే ప్రారంభమని ఇప్పటికే పలువురు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఇప్పటివరకైతే ప్రమాదం కాదని కేంద్ర వైద్యారోగ్య శాఖ చెబుతోంది. ఒమిక్రాన్‌ భారిన పడ్డ బాధితులకు… జలుబు, జ్వరం వంటి సాధారణ ఆరోగ్య సమస్యలు ఉండి త్వరగా కోలుకుంటున్నట్లు పేర్కొంటున్నారు.

2022 january 10 today corona updates covid and omicron cases in india

Advertisement

అయినప్పటికీ ప్రతీ ఒక్కరూ మాస్క్, శానిటైజర్‌, భౌతికదూరం వంటి నియమాలను తప్పక పాటించాలని సూచిస్తున్నారు. ఆ మధ్య కాస్త తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. గత రెండు మూడు రోజులుగా విపరీతంగా పెరుగుతుండటం ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తోంది.

Inesh A

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి