Today Gold Rates : పసిడి ప్రియులకు ఊరట.. స్థిరంగా బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలివే..!
Today Gold Rates : గత వారం రోజులుగా పసిడి ప్రియులకు మంచి రోజులు నడుస్తున్నాయి. బంగారం కొనేవారికి మంచి రోజులు కనిపిస్తున్నాయి. నాలుగు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం వెండి ధరలు నేడు చాలా ప్రాంతాల్లో నిలకడగానే ఉండగా.. కొన్ని చోట్ల మాత్రం ధరల్లో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. నిన్న బంగారం ధర స్వల్పంగా తగ్గగా… నేడు పలు ప్రాంతాల్లో స్వల్పంగా పెరిగింది. బంగారం కొనే వారికి ఈ మేరకు నేడు కాస్త ఊరట లభించే విధంగా ఉంది. దేశవ్యాప్తంగా వివధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధర ఇలా ఉంది.ముందుగా దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46, 760 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51, 010 గా ఉంది.
ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46, 610 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51, 010 గా ఉంది. ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44, 610 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48, 660 గా ఉంది. ఏపీ లోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 44, 610 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48, 660 గా ఉంది.బంగారం ధరలు ఇలా ఉండగా నేడు వెండి ధరల్లో మాత్రం ఏ మార్పు లేదు. మార్కెట్లో ప్రస్తుతం కేజీ సిల్వర్ ధర సగటకు రూ 64, 700 గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.64, 600 గా ఉండగా… ఢిల్లీ, ముంబయిలలో నిన్నటితో పోలిస్తే రూ. 300 పెరిగి.. రూ. 60, 700 గా ఉంది.
అయితే బులియన్ మార్కెట్‌లో బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు హెచ్చుతగ్గులు నమోద వుతుంటాయి. నిమిషం నిమిషానికి.. మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి. భారీ మొత్తంలో కొనాలి అనుకునే వారు.. ఆ మేరకు ఎప్పటికప్పుడు ధరలను గమనిస్తూ బంగారాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. న్యూ ఇయర్ తర్వాత కొద్ది రోజులు బంగారం ధరలు నిలకడగా ఉండటమో లేదా స్వల్పంగా తగ్గడమో జరుగుతూ వచ్చింది. అయితే తాజాగా తగ్గుతున్న ధరలను బట్టి చూస్తే వచ్చే వేసవిలో పెళ్లిళ్లు ఉన్న వారు ఇప్పుడే బంగారం కొని పెట్టుకుంటే మంచిదని అంటున్నారు. ఏది ఏమైనా పసిడి ప్రియులకు ఇది కాస్త ఊరటనిచ్చే అంశమే.