Today Covid Update : దేశంలో కొనసాగుతున్న కరోనా కల్లోలం.. తాజాగా రికార్డు స్థాయిలో మహమ్మారి కేసులు..!
Today Covid Update : దేశంలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. ఒక్కరోజే 3,06,064 కొవిడ్ కేసులు.!దేశంలో కరోనా మహమ్మారి చాప కింద నీరులా వేగంగా ప్రవహిస్తోంది. దేశవ్యాప్తంగా నిన్నతో పోలిస్తే నేడు కాస్త తక్కువ కేసులు నమోదయ్యాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్త కేసుల సంఖ్య ఏకంగా 3 లక్షల 6 వేల 64 కేసులు నమోదయ్యి… మహమ్మారి ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. డైలీ పాజిటివిటి రేటు 20. 75 శాతంగా నమోదయింది.
మహమ్మరితో తాజాగా 435 మంది మృత్యువాత పడ్డారు. దేశంలో ప్రస్తుతం 22, 43, 495 యాక్టిివ్ కేసులు ఉన్నాయి. తాజాగా 2, 43, 495 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. మరోవైపు దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ శరవేగంగా విస్తరిస్తూ గజ గజ లాడిస్తోంది. రోజూ వందల సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 10 వేలకు దాటింది. అయితే ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటివరకైతే ప్రమాదం కాదని కేంద్ర వైద్యారోగ్య శాఖ చెబుతోంది.
ఏది ఏమైనప్పటికీ కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో పలు రాష్ట్రాలు ఇప్పటికే లాక్ డౌన్ విధించాయి. తమిళనాడు, జమ్ముకాశ్మీర్ లో వీకెండ్ లాక్ డౌన్ కొనసాగుతోంది. ప్రతీ ఆదివారం లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఏపీతో పాటు ఇంకొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. కేసుల సంఖ్య రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉండవచ్చని భావిస్తున్నారు. ఆ మేరకు ప్రజలంతా కరోనా నిబంధనలు తప్పక పాటించాలని హెచ్చరిస్తున్నాయి.