Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా?
Today Gold Rates : నిన్న బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. కానీ.. మేడే సందర్భంగా మే 1 నాడు బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. దీంతో మహిళలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ఒకప్పుడు బంగారం కొనాలంటే పెద్దగా ఆలోచించేవారు కాదు కానీ.. ఇప్పుడు మాత్రం బంగారం పేరు ఎత్తితే చాలు.. మహిళలు కూడా భయపడుతున్నారు దానికి కారణం.. 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 50 వేల క్రాస్ మార్క్ దాటడం.
ఇక.. ఇవాళ దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.. ఇండియాలో గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు 15 రూపాయలు తగ్గింది. 10 గ్రాములకు 150 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ల బంగారానికి ఒక గ్రాముపై 16 రూపాయలు తగ్గింది. 10 గ్రాములపై 160 రూపాయలు తగ్గింది. 22 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు ప్రస్తుతం రూ.4840గా ఉంది. 10 గ్రాముల బంగారం ధర రూ.48,400గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ.5280గా ఉండగా.. 10 గ్రాములకు రూ.52,800గా ఉంది.
Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్లకు ఇవాళ 10 గ్రాముల బంగారం ధర రూ.48,400గా ఉంది. 24 క్యారెట్లకు రూ.52,800గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్లకు రూ.49,030, 24 క్యారెట్లకు రూ.53,490 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్లకు రూ.48,400గా ఉండగా 24 క్యారెట్లకు రూ.52,800గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్లకు రూ.48,400 ఉండగా.. 24 క్యారెట్లకు రూ.52,800గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే.. హైదరాబాద్ లో 22 క్యారెట్లకు రూ.48,400 కాగా.. 24 క్యారెట్లకు రూ.52,800 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్లకు రూ.48,400 కాగా 24 క్యారెట్లకు రూ.52,800గా ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్లకు రూ.48,400 కాగా 24 క్యారెట్లకు రూ.52,800గా ఉంది.
వెండి ధరలు చూసుకుంటే.. ఒక గ్రాము వెండికి ఈరోజు రూ.63.50 గా ఉంది. 50 పైసలు తగ్గింది. 10 గ్రాములకు 5 రూపాయలు తగ్గింది. 10 గ్రాములకు ఈరోజు ధర రూ.635గా ఉంది. కిలో బంగారం మీద రూ.500 తగ్గింది. రూ.63,500గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు చూసుకుంటే.. హైదరాబాద్ లో 10 గ్రాములకు రూ.635గా ఉంది. కిలో వెండి ధర రూ.69500గా ఉంది. విజయవాడలో 10 గ్రాములకు రూ.695, కిలో వెండికి రూ.69500గా ఉంది. విశాఖపట్టణంలో కూడా అదే ధర ఉంది.