Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా?

Today Gold Rates : మహిళలు గత మూడు రోజుల నుంచి బంగారం ధర విషయంలో శుభవార్త వింటున్నారు. నిన్న కూడా బంగారం ధరలు తగ్గాయి. తాజాగా మే 3న అంటే ఇవాళ కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. నిజానికి.. బంగారం కొనాలంటే ఈ రోజుల్లో చాలా కష్టం. ఒకప్పుడు బంగారం కొనడానికి ఏమాత్రం వెనుకా ముందు ఆలోచించేవారు కాదు కానీ.. నేడు మాత్రం బంగారం పేరు ఎత్తితే చాలు ఖచ్చితంగా భయపడుతున్నారు. నేడు బంగారం […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :3 May 2022,9:00 am

Today Gold Rates : మహిళలు గత మూడు రోజుల నుంచి బంగారం ధర విషయంలో శుభవార్త వింటున్నారు. నిన్న కూడా బంగారం ధరలు తగ్గాయి. తాజాగా మే 3న అంటే ఇవాళ కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. నిజానికి.. బంగారం కొనాలంటే ఈ రోజుల్లో చాలా కష్టం. ఒకప్పుడు బంగారం కొనడానికి ఏమాత్రం వెనుకా ముందు ఆలోచించేవారు కాదు కానీ.. నేడు మాత్రం బంగారం పేరు ఎత్తితే చాలు ఖచ్చితంగా భయపడుతున్నారు. నేడు బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

2022 april 12th today gold rates in telugu states

2022 april 12th today gold rates in telugu states

దేశవ్యాప్తంగా ఇవాళ బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.. ఒక గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర రూ.4720గా ఉంది. నిన్న ఒక గ్రాము బంగారం ధర రూ.4839గా ఉండేది. అంటే గ్రాముకు రూ.119 తగ్గిందన్నమాట. 10 గ్రాముల బంగారం 22 క్యారెట్లకు రూ.47,200 ఉండగా.. నిన్న రూ.48,390గా ఉంది. 10 గ్రాములకు రూ.1190 తగ్గింది. 24 క్యారెట్లకు ఒక గ్రాముకు రూ.5151 గా ఉంది. నిన్న ఒక్క గ్రాముకు రూ.5279 ఉండగా.. రూ.128 తగ్గింది. 109 గ్రాములకు ఇవాళ రూ.51,510గా ఉంది. నిన్న 10 గ్రాములకు రూ.52,790 ఉండగా.. తాజాగా రూ.1280 తగ్గింది.

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్లకు 10 గ్రాములకు రూ.47,200 ఉండగా.. 24 క్యారెట్లకు రూ.51,510గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్లకు రూ.48,550 ఉండగా.. 24 క్యారెట్లకు రూ.52,970 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్లకు రూ.47,200 ఉండగా.. 24 క్యారెట్లకు రూ.51,510 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్లకు రూ.47,200 ఉండగా 24 క్యారెట్లకు రూ.51,510గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో 22 క్యారెట్లకు రూ.47,200 ఉండగా.. 24 క్యారెట్లకు రూ.51,510గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్లకు రూ.47,200గా ఉండగా 24 క్యారెట్లకు రూ.51,510గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్లకు రూ.47,200గా ఉండగా.. 24 క్యారెట్లకు రూ.51,510గా ఉంది.

వెండి ధరలు చూసుకుంటే.. నిన్నటి ధరలతో పోల్చితే ఇవాళ వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. గ్రాముకు 80 పైసలు తగ్గాయి. ఒక గ్రాము ధర ఇండియాలో ఇవాళ 62.70గా ఉంది. 10 గ్రాములకు రూ.627గా ఉంది. 10 గ్రాములకు 80 రూపాయలు తగ్గింది. కిలో వెండి మీద రూ.62,700 ఉండగా.. రూ.800 తగ్గింది.

తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు చూస్తే.. హైదరాబాద్ లో 10 గ్రాముల వెండి ధర రూ.676గా ఉంది. కిలో వెండి ధర రూ.67600గా ఉంది. విజయవాడ, విశాఖపట్టణంలోనూ అదే ధర ఉంది.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది