Gold Rates | తగ్గుతున్న బంగారం ధరలు.. కొనుగోలు దారులకి కాస్త ఊరట
ప్రధానాంశాలు:
Gold Rates | ఇటీవల వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. శనివారం నాటికి 10 గ్రాముల బంగారం ధరపై రూ.10 మేర తగ్గుదల కనిపించగా, ప్రస్తుతం ధర రూ.1,43,390 వద్ద కొనసాగుతోంది.
gold rates, india, silver,silver price
Gold Rates | ఇటీవల వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. శనివారం నాటికి 10 గ్రాముల బంగారం ధరపై రూ.10 మేర తగ్గుదల కనిపించగా, ప్రస్తుతం ధర రూ.1,43,390 వద్ద కొనసాగుతోంది. త్వరలో వివాహాల సీజన్ ప్రారంభం కానుండటంతో వినియోగదారులు బంగారం ధరలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ధర కొద్దిగా తగ్గిన అవకాశాన్ని వినియోగించుకుని కొనుగోలు చేయాలనే ఆలోచనలో చాలామంది ఉన్నప్పటికీ, రానున్న రోజుల్లో ధరలు పెరుగుతాయా లేక మరింత తగ్గుతాయా అనే అనిశ్చితి కొనసాగుతోంది.
#image_title
స్వల్పంగా తగ్గుదల..
తాజా ధరల ప్రకారం చెన్నైలో 24 క్యారెట్ల బంగారం గ్రాము రూ.14,432గా ఉండగా, 22 క్యారెట్లు రూ.13,229, 18 క్యారెట్లు రూ.11,049గా ఉన్నాయి. ముంబైలో 24 క్యారెట్లు రూ.14,339, 22 క్యారెట్లు రూ.13,144, 18 క్యారెట్లు రూ.10,754గా నమోదయ్యాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల ధర రూ.14,354, 22 క్యారెట్లు రూ.13,159, 18 క్యారెట్లు రూ.10,769గా ఉన్నాయి. కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, కేరళ, పుణే, విజయవాడ నగరాల్లో కూడా 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.14,339గా, 22 క్యారెట్లు రూ.13,144గా, 18 క్యారెట్లు రూ.10,754గా కొనసాగుతోంది. వడోదర, అహ్మదాబాద్ నగరాల్లో 24 క్యారెట్ల ధర రూ.14,344, 22 క్యారెట్లు రూ.13,149, 18 క్యారెట్లు రూ.10,759గా ఉంది.
జైపూర్, లక్నోలో 24 క్యారెట్ల బంగారం గ్రాము రూ.14,354గా, 22 క్యారెట్లు రూ.13,159గా, 18 క్యారెట్లు రూ.10,769గా నమోదయ్యాయి. కోయంబత్తూరు, మధురైలో మాత్రం ధరలు కొంచెం ఎక్కువగా ఉండి 24 క్యారెట్లు రూ.14,432, 22 క్యారెట్లు రూ.13,229, 18 క్యారెట్లు రూ.11,049గా కొనసాగుతున్నాయి. మొత్తం మీద స్వల్ప తగ్గుదల ఉన్నప్పటికీ, పెళ్లిళ్ల సీజన్ ప్రభావంతో బంగారం ధరలపై ఆసక్తి మరింత పెరుగుతోంది.