YS Jagan : వైఎస్ జగన్ కి అతిపెద్ద ఎన్నికల పరీక్ష..!

Advertisement

YS Jagan : ఏపీ సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేసి నాలుగేళ్లు అవుతోంది. 2019లో ఆయన ఏపీకి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన నాలుగేళ్లలో ఏపీలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రారంభించారు. నాలుగేళ్ల పాలన ఎలా ఉంది అనేది పక్కన పెడితే.. వచ్చే ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. వచ్చే ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి. మళ్లీ సీఎం జగన్ కు అధికారాన్ని కట్టబెడతారా? లేక ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు అనేది అర్థం కావడం లేదు.

Advertisement
2024 is the election test for ysrcp party
2024 is the election test for ysrcp party

నిజానికి రాజకీయాలు అంటేనే రాత్రికి రాత్రే మారిపోతుంటాయి. రాజకీయాల్లో మంచి చెడులు ఉంటాయా? ఎప్పుడు ఏం జరిగేది ఎవ్వరూ ఊహించలేరు. ప్రజల నిర్ణయమే తుది నిర్ణయం. కానీ.. ప్రభుత్వం చేపట్టిన పనుల ఆధారంగానే ప్రజలు కూడా నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతం ఏపీలో పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వం.. పాలనా విధానాలు బాగానే ఉన్నాయి. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాల కోసం వైసీపీ ప్రభుత్వం చేస్తున్న కృషి హర్షనీయమైనది. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను మరెవరూ ఇప్పటి వరకు తీసుకురాలేదు.

Advertisement
2024 is the election test for ysrcp party
2024 is the election test for ysrcp party

YS Jagan : ప్రస్తుతం వైసీపీ ముందున్న సవాళ్లు ఏంటి?

రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీకి అందరూ అనుకూలంగానే ఉన్నారు. 2019 ఎన్నికల్లో వచ్చిన సీట్ల కంటే కూడా ఈసారి ఒక్క సీటును కోల్పోకుండా 175 సీట్లకు 175 గెలవాలనే తపనలో వైసీపీ ఉంది. సీఎం జగన్ కూడా వై నాట్ 175 అంటున్నారు. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు. కానీ.. ఇది వైఎస్ జగన్ కు అది పెద్ద పరీక్ష అనుకోవాల్సిందే. ఈ సారి కూడా సీఎం జగన్ ఏపీలో విజయదుందుబి మోగిస్తే ఇక ఆయనకు తిరుగులేదు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని అబద్ధపు హామీలు కురిపించినా.. ఎన్ని సంక్షేమ పథకాలు హామీ ఇచ్చినా కూడా ప్రజలు సీఎం జగన్ వైపే ఉంటారు.

Advertisement
Advertisement