Bharat Rice
Bharat Rice : ప్రస్తుతం మార్కెట్లో బియ్యం ధరలు భారీగా పెరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. దేశమంతటా వరి ఉత్పత్తి భారీ ఎత్తున పెరిగినప్పటికీ బియ్యం ధరలు మాత్రం అస్సలు తగ్గడం లేదు. రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మధ్యతరగతి వారికి కాస్త ఊరట కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా భారత్ రైస్ ని తీసుకొచ్చింది. సామాన్య మరియు పేద ప్రజలకు అతి తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం అందించే దిశగా ప్రభుత్వం భారత్ బ్రాండ్ పేరిట ఈ బియ్యం ని తీసుకొచ్చినట్లు సమాచారం. ఇక ఈ బియ్యాన్ని కిలో 29 రూపాయలకే విక్రయిస్తున్నారు. ఇప్పటికే ఈ బియ్యం విక్రయాలను కూడా ప్రారంభించారు. ఇక ఈ బియ్యాన్ని నేషనల్ అగ్రికల్చర్ కోపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మరియు నేషనల్ కోపరేటివ్ కన్జ్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, కేంద్రీయ బండార్ రిటైల్ కేంద్రాలతో పాటు మొబైల్ ఔట్లెట్స్ లో కూడా విక్రయిస్తున్నట్లు సమాచారం.
ఇక హైదరాబాదులో ఈ బియ్యం కేంద్రాలు ఎక్కడున్నాయి అనే అంశం గురించి మాట్లాడుకున్నట్లయితే… కోటిలో కేంద్రీయ బండార్, గన్ పార్క్ సమీపంలో NaaFeed , అదేవిధంగా సుల్తాన్ బజార్లో ఎన్సిసిఎఫ్ అందుబాటులో ఉన్నాయి. ఈ మూడు కేంద్రాలలో భారత్ పేరిట రైస్ ను విక్రయిస్తున్నారు. అతి త్వరలోనే మొబైల్ అవుట్ లైట్స్ లో కూడా ప్రారంభమవుతాయి. అంతేకాక ఈ కామర్స్ సంస్థలైనటువంటి అమెజాన్ ఫ్లిప్కార్ట్ జియో మార్ట్ వంటి సైట్లలో కూడా ఈ భారత రైస్ ఆర్డర్ ను చేసుకోవచ్చని అధికారులు తెలియజేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఇది అందుబాటులో లేవు కాని త్వరలోనే ఈ కామర్స్ లో కూడా అమ్ముతారని సమాచారం. ఇక ఈ భారత్ రైసు 5 లేదా 10 కేజీల బ్యాగులలో మాత్రమే లభిస్తాయి. అయితే ఈ భారత్ రైస్ ను తొలిదశలో రిటైల్ మార్కెట్ లో ఐదు లక్షల టన్నుల వరకు విక్రయిస్తామని కేంద్రం తెలియజేసింది.
అయితే ప్రస్తుతం బహిరంగ మార్కెట్ లో చూసుకున్నట్లయితే కిలో సన్న బియ్యం 60 నుంచి 70 రూపాయలుగా ఉంది. ఇక ఇప్పుడు భారత రైతును అతి తక్కువ ధరకు 29 రూపాయలకే విక్రయిస్తుండడంతో సామాన్యులు దీనిని కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు. బియ్యం ఎగుమతులపై నిషేధం విధించినప్పటికీ బియ్యం ధర 15% మేర పెరగడంతో సామాన్యుల కోసం భారత్ కేంద్ర ప్రభుత్వం ఈ ఆలోచన చేసింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే భారత్ గోధుమ పిండి కిలో రూ.27.50 , భారత్ శనగపప్పును 60 రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. వీటికి కూడా సామాన్యుల నుంచి మంచి ఆదరణ లభించింది అని చెప్పాలి. బియ్యం ధరలను నియంత్రించేందుకే ప్రభుత్వం ఇలాంటి చర్యలు చేపట్టిందని తెలుస్తోంది. అలాగే బియ్యం ధరలు తగ్గేవరకు ఎగుమతులపై నిషేధం ఉంటుందని వెల్లడించింది.
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. తాజాగా…
It Professionals Faces: ప్రస్తుతం భారతదేశంలో టేక్కు పరిశ్రమలలో ఒక భయానక ఆందోళనలు పెరిగాయి. టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో…
This website uses cookies.