Ys jagan జగన్ సంచలన సర్వే… డేంజర్ జోన్ లో 30 మంది ఎమ్మెల్యేలు..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ys jagan జగన్ సంచలన సర్వే… డేంజర్ జోన్ లో 30 మంది ఎమ్మెల్యేలు..!!

YS Jagan : వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్  YS Jaganవచ్చే సార్వత్రిక ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకోవడం తెలిసిందే. ఎట్టి పరిస్థితులలో జరగబోయే ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా 175 కి 175 స్థానాలు గెలవాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గ ఎమ్మెల్యేలు మరియు సమన్వయకర్తలు, ఇన్చార్జులు నిరంతరం ప్రజలలో ఉండేలా రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం పేరిట ప్రతి ఎమ్మెల్యే స్థానిక నియోజకవర్గంలో పర్యటించేలా టాస్క్ పెట్టడం […]

 Authored By sekhar | The Telugu News | Updated on :14 February 2023,4:00 pm

YS Jagan : వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్  YS Jaganవచ్చే సార్వత్రిక ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకోవడం తెలిసిందే. ఎట్టి పరిస్థితులలో జరగబోయే ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా 175 కి 175 స్థానాలు గెలవాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గ ఎమ్మెల్యేలు మరియు సమన్వయకర్తలు, ఇన్చార్జులు నిరంతరం ప్రజలలో ఉండేలా రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం పేరిట ప్రతి ఎమ్మెల్యే స్థానిక నియోజకవర్గంలో పర్యటించేలా టాస్క్ పెట్టడం జరిగింది. ఇదే సమయంలో మరొక రాష్ట్రవ్యాప్తంగా జగన్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు సర్వేలు కూడా చేయించుకుంటూ ఉన్నారు.

ఇదిలా ఉంటే ఫిబ్రవరి 13వ తారీకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలతో నేతలతో జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు డేంజర్ జోన్ లో ఉన్నట్లు అసలు ఇల్లు గడప దాటి ప్రజలలోకి వెళ్ళటం లేదని.. సీఎం జగన్ మండిపడటం జరిగిందంట. ముఖ్యంగా గ్రామాల్లోకి వెళ్ళకుండా వ్యవహరించిన ఎమ్మెల్యే లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఇలానే వ్యవహరిస్తే టికెట్ ఇచ్చే ప్రసక్తి లేదని.. ప్రజలలో మీపై అసంతృప్తి ఉందని డేంజర్ జోన్ లో ఉన్నట్లు సదరు నేతలకు జగన్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది అంట. ఈ క్రమంలో పార్టీ నేతలతో జగన్ నిర్వహించిన సమీక్ష సమావేశం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

30 mlas in danger zone Ys Jagan sensational survey

30 mlas in danger zone Ys Jagan sensational survey

అంతేకాదు మార్చి 18 నుండి మా భవిష్యత్తు నీవే జగన్ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నేతలకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గృహ సారథులు కీలకమని స్పష్టం చేశారు. వాళ్లు ప్రతి ఇంటితో టచ్ లో ఉండాలని పేర్కొన్నారు. ఇంకా ఆదేశించిన కార్యక్రమాలలో ఎవరైనా నిర్లక్ష్యం వ్యవహరిస్తే టికెట్ ఇచ్చే ప్రసక్తి లేదని.. అధినేత నేతలకు చురకలాంటించడం జరిగింది.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది