317 GO : 317 జీవోపై వినూత్న నిరసన.. తాతా అంటూ కేసీఆర్‌కు సూటి ప్రశ్న? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

317 GO : 317 జీవోపై వినూత్న నిరసన.. తాతా అంటూ కేసీఆర్‌కు సూటి ప్రశ్న?

 Authored By mallesh | The Telugu News | Updated on :15 January 2022,8:15 pm

317 GO : తెలంగాణ సర్కారు తీసుకొచ్చిన 317 జీవోను ఉద్యోగులు, ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే, టీఆర్ఎస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నది. ఈ జీవో విషయమై ఉద్యోగులు ప్రతీ రోజు ఏదో ఒక రూపంలో నిరసన తెలుపుతూనే ఉన్నారు. కాగా, ఈ సారి ఉద్యోగుల పిల్లలు తాము 317 జీవో వలన ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కేసీఆర్ ను ప్రశ్నించారు. సంక్రాంతి సందర్భంగా ముగ్గుతో వినూత్న నిరసన తెలిపారు.సంక్రాంతి సందర్భంగా అందరూ ఇళ్ల ఎదుట ముగ్గులు వేసుకుంటున్నారు.

ఈ క్రమంలోనే ముగ్గు ద్వారా కూడా నిరసన తెలపాలనే ఉద్దేశంతో ముగ్గు వేశారు. సదరు ముగ్గులో ఆదిలాబాద్ కు చెందిన చిన్నారులు తమ ప్రశ్నలు కూడా సంధించారు. తమ తల్లికి ఒక జిల్లా, తండ్రికి మరో జిల్లా కేటాయించడంతో తమ పరిస్థితి ఏంటని ఈ సందర్భంగా వారు వినూత్న రీతిలో విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని చిన్నారులు ముగ్గులో రాశారు.తాము ఏ జిల్లాకు వెళ్లాలి అని కేసీఆర్‌ను తాత అని సంబోధిస్తూ అడిగారు. ఈ క్రమంలోనే తమ తల్లిదండ్రులను తమ నుంచి విడదీయొద్దని, తమ వద్దే ఉంచాలని కోరారు.

317 go children request to cm kcr on 317 go

317 go children request to cm kcr on 317 go

317 GO : చేతులు జోడించి.. ముగ్గు వద్ద కూర్చొని కేసీఆర్‌కు వినతి..

ముగ్గులో వారి హ్యాపీ పొంగల్ అని ఇంగ్లిష్ అక్షరాలతో రాసిన క్రమంలో ఎడమ వైపున ‘అమ్మ ఒక జిల్లా.. నాన్న ఒక జిల్లా.. నేను ఏ జిల్లా… కేసీఆర్ తాతా? ’ అని రాశారు. మరో వైపున జీవో నెం.317 స్పౌజ్ బాధితులు ఆదిలాబాద్ అని పేర్కొన్నారు. ఇక ఈ ముగ్గు ముందర ఇద్దరు అమ్మాయిలు చేతులు జోడించి మరి ఫొటోలు దిగారు. ఈ ఫొటోలు ప్రజెంట్ సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. మొత్తంగా ఉద్యోగులే కాదు ఉద్యోగుల పిల్లలు కూడా వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్నారు. ఈ సంగతి ఈ చిన్నారులు చేసిన పని ద్వారా స్పష్టమవుతున్నది.

Also read

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది