55 Years Old Lady : 55 ఏళ్ల వయసులో పదవ తరగతి పరీక్షలు… ఇంతకీ ఎవరు ఆమె..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

55 Years Old Lady : 55 ఏళ్ల వయసులో పదవ తరగతి పరీక్షలు… ఇంతకీ ఎవరు ఆమె..?

55 Years Old Lady : సాధారణంగా పదవ తరగతి పరీక్షలు రాయాలంటే వయసు 15 సంవత్సరాలు దాటాలి. కొంతమంది వండర్ కిడ్స్ చిన్న చిన్న వయసులోనే పెద్ద పెద్ద చదువులు చదివేస్తారు. అయితే హైదరాబాద్ జిల్లాకి చెందిన 55 సంవత్సరాల ఓ అవ్వ… పట్టు విడవకుండా పదవ తరగతి పరీక్ష రాయడం జరిగింది. ఈ వయసులో పదవ తరగతి పరీక్షలు రాయటం అవసరమా అని ఆరా తీస్తే… తన లక్ష్యం కోసం అని జవాబు ఇచ్చింది. […]

 Authored By sekhar | The Telugu News | Updated on :7 May 2023,7:00 pm

55 Years Old Lady : సాధారణంగా పదవ తరగతి పరీక్షలు రాయాలంటే వయసు 15 సంవత్సరాలు దాటాలి. కొంతమంది వండర్ కిడ్స్ చిన్న చిన్న వయసులోనే పెద్ద పెద్ద చదువులు చదివేస్తారు. అయితే హైదరాబాద్ జిల్లాకి చెందిన 55 సంవత్సరాల ఓ అవ్వ… పట్టు విడవకుండా పదవ తరగతి పరీక్ష రాయడం జరిగింది. ఈ వయసులో పదవ తరగతి పరీక్షలు రాయటం అవసరమా అని ఆరా తీస్తే… తన లక్ష్యం కోసం అని జవాబు ఇచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అదిలాబాద్ జిల్లాకి చెందిన చిలకపద్మ.. వయసు 55 సంవత్సరాలు. ఈమే వార్డు మెంబర్ గా ప్రజలకు సేవలు అందిస్తూ ఉంది.

Telangana: గ్రేట్..55 ఏళ్ల వయసులో టెన్త్ హెగ్జామ్స్ రాసిన పద్మ..ఇంతకీ  ఎవరామే? ఎందుకోసం? / Padma written Tenth exams to become Sarpanch– News18  Telugu

అయితే ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి సర్పంచ్ కావాలని ఈమె లక్ష్యం. కానీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయాలంటే… కచ్చితంగా పదవ తరగతి పాస్ అయ్యి ఉండాలి. అందుకే చిలక పద్మ తన విద్యార్హత పెంచుకోవాలని డిసైడ్ అయింది. తన చిన్నతనంలో ఏడవ తరగతితోనే చదువు ముగించుకున్న పద్మ… 40 సంవత్సరాల తర్వాత మళ్లీ తన చదువును కొనసాగించాలని అనుకుంది. కానీ ఆమె పిల్లలతో కలిసి స్కూల్ కి వెళ్లి చదువుకునే వయసులో లేదు. అయితే ఆమె తన లక్ష్యం చేరుకోవడానికి… డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఎంపిక చేసుకుంది. ఓపెన్ స్కూల్ ద్వారా పదవ తరగతి పరీక్షలకు ఫీజు కట్టింది.

55 Years Old Lady attend for 10th Class Exams

55 Years Old Lady attend for 10th Class Exams

ఏప్రిల్ 28వ తారీకు మొదలైన ఓపెన్ పదవ తరగతి పరీక్షలు… ఈనెల మూడవ తారీకు నాడు ముగిశాయి. అదిలాబాద్ జిల్లాలోని గవర్నమెంట్ స్కూల్ బడిలో.. పద్మ… పరీక్షలు రాసే సెంటర్ పడింది. పద్మా తన భర్త మరియు మనవడితో కలిసి పరీక్షలు రాయటానికి పరీక్షా కేంద్రానికి వచ్చేది. 55 సంవత్సరాల పద్మ పరీక్ష రాయటం అందరికీ ఆశ్చర్యాన్ని గురిచేసింది. ఏమో ఇబ్బందులతో చదువు మానేసిన వారికి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఒక చక్కటి అవకాశం. ఏ వయసులో ఉన్నా సరే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా… లక్ష్యాన్ని చేరుకోవచ్చు. పద్మా విషయానికొస్తే… డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఓ వరంలా దొరికింది. దీంతో పద్మ ఫలితాల కోసం ఎదురుచూస్తూ ఉంది.

Also read

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది