7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మళ్లీ పెరగనున్న జీతాలు..!
7th Pay Commission Big Update:కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు పెరగనున్నాయి. అది కూడా హొలీ కంటే ముందే. జనవరి 1, 2022 నుండి అమల్లోకి వచ్చే డియర్‌నెస్ అలవెన్స్‌ను 3% పెంచాలని మోడీ ప్రభుత్వం యోచిస్తోంది. అలాగే, ఉద్యోగులు కూడా తమ పెండింగ్ బకాయిలను 2022 లేదా హోలీ నాడు స్వీకరిస్తారని అంచనా. 65 లక్షల మంది పెన్షనర్లు దీని నుండి ప్రయోజనం పొందుతారు. ఈసారి హోళీ మార్చి 18న వచ్చింది. అంటే మార్చి 18 కంటే ముందే ఉద్యోగులకు వేతనాలు పెరగనున్నాయి. గత కొంత కాలం నుండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డియర్‌నెస్ అలవెన్స్ పెంపు, డియర్‌నెస్ రిలీఫ్ బకాయిలు విడుదల, హౌసింగ్ రెంట్ అలవెన్స్ పెంపు కోసం చూస్తున్నారు.
7th Pay Commission : ఉద్యోగులకి గుడ్ న్యూస్ అందించిన కేంద్ర ప్రభుత్వం..
డీఏ పెంపు 3 శాతం వరకు ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 31 శాతం డియర్‌నెస్ అలవెన్స్‌ను కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. మరో మూడు శాతం కనుక పెరిగితే మొత్తంగా ఉద్యోగుల డీఏ 34 శాతానికి పెరుగుతుంది. సెవెంత్ పే కమిషన్ ప్రతిపాదనలను ఆధారంగా చేసుకుని డీఏ పెంపును కేంద్రం చేపడుతుంది. ఇది ఇలా ఉండగా గత ఏడాది జూలై, అక్టోబర్‌లో రెండుసార్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను పెంచారు. దీంతో 47.14 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.62 లక్షల పెన్షనర్లు 31 శాతం డీఏ పొందుతున్నారు.
కేంద్ర ఉద్యోగులకు మార్చిలో వారి పూర్తి జీతం, డీఏ బకాయిలతో సహా వస్తుంది. లెవెల్-1 ఉద్యోగుల డీఏ బకాయిలు రూ.11,880 నుంచి రూ.37,554 వరకు ఉన్నాయని జేసీఎం నేషనల్ కౌన్సిల్ శివ్ గోపాల్ మిశ్రా పేర్కొన్నట్లు మీడియా నివేదిక మరింత స్పష్టం చేసింది. లెవెల్-13 (7వ CPC బేసిక్ పే స్కేల్ రూ. 1,23,100 నుండి రూ. 2,15,900) లేదా లెవెల్-14 (పే స్కేల్)లోని ఉద్యోగులు వరుసగా రూ. 1,44,200 మరియు రూ. 2,18,200 డీఏ బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది.