7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. భారీగా ఏప్రిల్ జీతం.. ఒకేసారి రూ.1.20 లక్షలు పడనున్నాయి
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే డీఏ పెంచిన విషయం తెలిసిందే. మరోసారి జులైలో డీఏ పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో.. ఏడో వేతన సంఘం సిఫారసుల మేరకు డీఏ బకాయిలపై నిర్ణయం తీసుకుంది. ప్రతి సంవత్సరం రెండు సార్లు డీఏ పెరగనున్న విషయం తెలిసిందే. గత జనవరికి సంబంధించిన డీఏను మార్చిలో పెంచారు.38 నుంచి 42 శాతానికి డీఏ పెంచారు.
7th Pay Commission three good news to central government employees
దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా పెరిగాయి. అయితే.. కోవిడ్ సమయంలో పెండింగ్ లో ఉన్న డీఏ బకాయిలు ఇప్పటి వరకు చెల్లించలేదు. కనీసం 18 నెలల డీఏ బకాయిలు ఉద్యోగులకు రావాలి. కానీ.. దానిపై చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉంచుతూ వచ్చింది కేంద్రం. దానిపై తాజాగా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఏడో వేతన సంఘం సిఫారసు మేరకు కేంద్రం డీఏ బకాయిలను చెల్లించాలని నిర్ణయించింది.
7th Pay Commission da arrears to be get for central govt employees in april salary
7th Pay Commission : ఏప్రిల్ 30న ఉద్యోగుల ఖాతాల్లో జమ కానున్న బకాయిలు
డీఏ బకాయిలను కేంద్రం ఉద్యోగుల ఖాతాల్లో ఏప్రిల్ 30న జమ చేయనుంది. ఒక్కో ఉద్యోగికి కనీసం రూ.1.20 లక్షలు జమ చేయనుంది కేంద్రం. అది కూడా ఈనెల జీతంతోనే పడనుంది. అంటే ఒక్కొక్కరికి లక్షల్లో జీతాలు పడనున్నాయి. కోటి మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లు దీని ద్వారా లబ్ధి చేకూరనున్నారు. 18 నెలల డీఏ బకాయిలు అంటే.. ఒక ఉద్యోగికి కనీసం రూ.1.20 లక్షలు రానుంది. పెరిగిన డీఏతో పాటు డీఏ బకాయిలు, జీతం అన్నీ కలిపితే లక్షల్లో జీతం ఈ సారి ఉద్యోగులకు రానుంది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు భారీగా లక్షల్లో జీతాలు పొందనున్నారు. ఎగిరి గంతేస్తున్నారు.
