Home » News » 7th Pay Commission Da To Hike In July For Central Govt Employees
News

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు.. డీఏ ఎంత పెంచుతున్నారో తెలుసా?

Authored By
Jagadesh Gatla
The Telugu News | Published on: July 7, 2022, 6:00 pm
Advertisement

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్ వెయిట్ చేస్తోంది. ఏడో వేతన సంఘం సిఫారసు మేరకు.. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగబోయే కేంద్ర కేబినేట్ మీటింగ్ లో డీఏ పెంపుపై నిర్ణయం తీసుకొనున్నారు. డీఏను ఎంత పెంచుతున్నారో ఈ భేటీలో నిర్ణయించిన తర్వాత ప్రకటించనున్నారు. దీని వల్ల.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి. ప్రస్తుతానికి 5 శాతం డీఏ పెంచాలని కేంద్రం యోచిస్తోంది. సాధారణంగా ప్రస్తుతం ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకొని డీఏ, డీఆర్ ను కేంద్రం సంవత్సరానికి రెండు సార్లు పెంచుతుంది.

Advertisement

అయినప్పటికీ.. ఒక ఉద్యోగి బేసిక్ పే ఆధారంగా జీతం పెరుగుతుంది. బేసిక్ పేలో ఇతర అలవెన్సులు ఏవీ ఉండవు. అంటే.. ఉదాహరణకు ఒక ఉద్యోగి బేసిక్ పే రూ.18000 ఉంటే.. వాళ్లకు ప్రస్తుతం ఉన్న డీఏ ప్రకారం డీఏ రూ.6120 వస్తుంది. ఇదివరకు ఉన్న డీఏ 31 శాతానికి కాలిక్యులేట్ చేస్తే డీఏ రూ.5580 వస్తుంది. ప్రస్తుతం ఉన్న డీఏ ద్వారా ఒక ఉద్యోగికి డీఏలో రూ.540 పెరుగుదుల ఉంది. ప్రస్తుతం ఉన్న డీఏను ఇంకో 5 శాతానికి పెంచితే.. ఉద్యోగికి డీఏలో 39 శాతం అంటే బేసిక్ పేలో 18 వేలతో డీఏలో రూ.7020 వస్తుంది. అంటే..

7th Pay Commission da to hike in july for central govt employees

Advertisement

DA Hike : డీఏ 5 శాతం పెంచితే జీతం ఎంత పెరుగుతుంది?

జీతం రూ.900 పెరుగుతుంది. ఏడో వేతన సంఘం ప్రకారం.. 2006 లో కేంద్ర ప్రభుత్వం డీఏ, డీఆర్ ను సవరించింది. ద్రవ్యోల్బణాన్ని బట్టి ప్రతి సంవత్సరం జనవరి, జులైలో కేంద్రం డీఏను పెంచుతూ ఉంటుంది. ఈ సంవత్సరం రిటైల్ ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉండటం వల్ల.. డీఏలో పెరుగుదల కూడా ఎక్కువగానే ఉంటుంది. కానీ.. ఉద్యోగి బేసిక్ పే ఆధారంగా.. డీఏలో కూడా మార్పులు ఉంటాయి. అర్బన్ సెక్టార్, సెమీ అర్బన్ సెక్టార్, రూరల్ సెక్టార్ లో పనిచేసే ఉద్యోగులకు డీఏ పెంపు వల్ల పెరిగే జీతంలో తేడాలుంటాయి.

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి