Naga Chaitanya : అక్కినేని వారసుడు నాగ చైతన్య పర్సనల్ లైఫ్‌లో కాస్త డిస్ట్రబెన్స్ ఏర్పడినా కూడా ప్రొఫెషనల్ లైఫ్‌లో మాత్రం దూసుకుపోతున్నాడు. వరుస సినిమాలతో సందడి చేస్తున్న చైతూ త్వరలో థ్యాంక్యూ చిత్రంతో పలకరించనున్నాడు. దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమాకు విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీని జులై 22న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో జోరుగా పాల్గొంటున్న నాగ చైతన్య తాజాగా సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్‌గా పోస్ట్ చేశాడు. సమంత, నాగ చైతన్య నాలుగేళ్లు కలిసి కాపురం చేశారు.
ఈ జర్నీలో ఇష్టపడే కామన్ థింగ్స్ ఉండడం అనేది సర్వసాధారణం. ఇంట్లో వస్తువులు, స్థలాలు, అలాగే పెట్ డాగ్స్. ముఖ్యంగా పెట్ డాగ్స్ తో గట్టి బంధం ఏర్పడుతూ ఉంటుంది. కుటుంబ సభ్యులందరితో అవి అనుబంధం కలిగి ఉంటాయి. అలా సమంత తీసుకొచ్చిన పెట్ డాగ్ హ్యాష్ తో నాగ చైతన్యకు మంచి బాండింగ్ ఏర్పడింది. హ్యాష్ సైతం నాగచైతన్యను ఎంతగానో ఇష్టపడేది. అయితే నాగ చైతన్యకు విడాకుల తర్వాత సమంత హ్యాష్ ని తనతోపాటు తీసుకుపోయింది. దీంతో హ్యాష్, చైతూకి మధ్య చాలా గ్యాప్ వచ్చింది. అయితే తాజాగా చైతూ తన ఎమోషనల్ నోట్ లో ‘థ్యాంక్యూ అనే పదాన్ని చాలా ఎక్కువగా వాడుతుంటాను. కానీ కొన్ని సార్లు అదొక్కటే సరిపోదు. నా తదుపరి చిత్రం థ్యాంక్యూ ఈ ఆలోచనకు కారణం.
ఈ మూవీ జర్నీ నన్ను కదిలించింది’ అని రాసుకొస్తూ.. తమ జీవితంలో ఎవరికీ థ్యాంక్యూ చెప్పాలనుకుంటున్నారో ఫొటోలను షేర్ చేసి ట్యాగ్ చేయమని కోరాడు.ఇందులో భాగంగానే చైతన్న చిన్నతనంలో తన తల్లితో తీసుకున్న ఫొటో, తండ్రి నాగార్జునతో కలిసి దిగిన పిక్‌తోపాటు సమంత పెంపుడు హ్యాష్‌తో తీసుకున్న ఫొటోను షేర్ చేశాడు. తన జీవితంలో అతి ముఖ్యమైన ముగ్గురికి థ్యాంక్ యూ చెప్పాడు. మొదటి రెండు స్థానాలు అమ్మ, నాన్నలకు ఇచ్చిన నాగ చైతన్య మూడో స్థానం సమంత పెట్ డాగ్ హ్యాష్ కి ఇచ్చాడు. ‘ఎలా ప్రేమించాలో, మనిషిగా ఎలా ఉండాలో చూపించినందుకు థ్యాంక్స్ హ్యాష్’ అంటూ ఎమోషనల్‌గా నోట్స్ రాసుకొచ్చాడు చైతూ. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ నెట్టింట వైరల్ అవుతోంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.