
Smart TV : రూ.7,499కే 32 అంగుళాల స్మార్ట్ టీవీ..! తక్కువ ధరలో లగ్జరీ ఫీచర్లు – నెటిజన్లను ఆకట్టుకుంటున్న డీల్
Smart TV : మీరు కొత్త స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా? కానీ ఎక్కువ ధరలు చూసి వెనకడుగు వేస్తున్నారా? అయితే ఈ ఆఫర్ మీకోసమే. అమెజాన్ వేదికగా ప్రస్తుతం 32 అంగుళాల స్మార్ట్ టీవీ కేవలం రూ.7,499కే అందుబాటులో ఉంది. తక్కువ ధరతో పాటు మంచి ఫీచర్లు, రేటింగ్స్ ఉండటంతో ఇప్పటికే వేల మంది ఈ టీవీని కొనుగోలు చేశారు. సాధారణంగా టీవీ కొనే సమయంలో చాలా మంది బ్రాండెడ్ కంపెనీల వైపే మొగ్గు చూపుతారు. అయితే వాటి ధరలు ఎక్కువగా ఉండటంతో పాటు, టెక్నాలజీ వేగంగా మారిపోతుండటంతో కొద్ది సంవత్సరాల్లోనే అవి పాతబడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో నిపుణులు కూడా ఎక్కువ ఖర్చు పెట్టకుండా, మంచి రేటింగ్ ఉన్న బడ్జెట్ టీవీలను ఎంచుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
Smart TV : రూ.7,499కే 32 అంగుళాల స్మార్ట్ టీవీ..! తక్కువ ధరలో లగ్జరీ ఫీచర్లు – నెటిజన్లను ఆకట్టుకుంటున్న డీల్
ఈ టీవీ VW కంపెనీకి చెందిన 80 సెంటీమీటర్లు (32 అంగుళాలు) సైజ్‌లో వస్తుంది. పెద్ద బ్రాండ్ కాకపోయినా, నెటిజన్లలో ఈ కంపెనీ టీవీలకు మంచి ఆదరణ లభిస్తోంది. తక్కువ ధరలోనే మంచి క్వాలిటీ అందించడంతో రివ్యూలు, రేటింగ్స్ బాగున్నాయి.
ఈ స్మార్ట్ టీవీకి 24 వాట్స్ సౌండ్ ఔట్‌పుట్ ఉంది. బాక్స్ స్పీకర్లతో స్టీరియో సౌండ్ వస్తుంది. అలాగే ఐదు రకాల సౌండ్ మోడ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. డిస్‌ప్లే విషయానికి వస్తే QLED, IPE టెక్నాలజీతో వస్తూ 1.67 కోట్ల కలర్స్‌ను సపోర్ట్ చేస్తుంది.
ఈ టీవీకి HD రెడీ రిజల్యూషన్ (1366 x 768 పిక్సెల్స్) ఉంది. 60Hz రిఫ్రెష్ రేటుతో కళ్లకు హాని లేకుండా వీక్షించవచ్చు. 178 డిగ్రీల వ్యూయింగ్ యాంగిల్ ఉండటంతో ఇంట్లో ఎక్కడ కూర్చున్నా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది.
Smart TV స్మార్ట్ ఫీచర్లు కూడా ఫుల్
Prime Video, Netflix, Jio Hotstar, Zee5 వంటి ప్రముఖ ఓటీటీ యాప్స్ ఇన్‌బిల్ట్‌గా ఉన్నాయి. స్క్రీన్ మిర్రరింగ్ సపోర్ట్ ఉండటంతో మొబైల్‌లోని కంటెంట్‌ను నేరుగా టీవీలో ప్లే చేయవచ్చు. PCకి కనెక్ట్ చేసే అవకాశం కూడా ఉంది. క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో టీవీ స్మూత్‌గా పనిచేస్తుంది.
HDMI, USB పోర్టులు, వైఫై, LAN కనెక్షన్ వంటి అన్ని అవసరమైన కనెక్టివిటీ ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. ఎనర్జీ రేటింగ్ 4 ఉండటంతో విద్యుత్ వినియోగం కూడా తక్కువే. ఏడాదికి సుమారు 46 యూనిట్ల కరెంట్ మాత్రమే ఖర్చవుతుంది.
భారీ డిస్కౌంట్ – EMI ఆప్షన్
ఈ టీవీ అసలు ధర రూ.18,999 కాగా, ప్రస్తుతం 61 శాతం డిస్కౌంట్‌తో రూ.7,499కే అందుబాటులో ఉంది. EMIలో కొనాలంటే నెలకు కేవలం రూ.264 చెల్లిస్తే సరిపోతుంది. పాత టీవీని ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ.2,000 వరకు అదనపు లాభం కూడా పొందవచ్చు.
ఇప్పటికే 17,000 మందికి పైగా ఈ టీవీని కొనుగోలు చేయగా, 4/5 రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఒక సంవత్సరం వారంటీ, 10 రోజుల రీప్లేస్‌మెంట్ ఆప్షన్ ఉండటంతో కస్టమర్లు నమ్మకంగా కొనుగోలు చేస్తున్నారు.
కస్టమర్ అభిప్రాయాలు
చాలా మంది వినియోగదారులు ధరకు తగిన విలువ ఉందని, పిక్చర్ క్వాలిటీ, సౌండ్ పనితీరు బాగున్నాయని ప్రశంసిస్తున్నారు. అయితే కొందరు యాప్స్ పనితీరుపై మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయినా కూడా బడ్జెట్‌లో మంచి స్మార్ట్ టీవీ కావాలనుకునే వారికి ఇది ఓ మంచి ఆప్షన్‌గా మారింది.
Kethireddy Peddareddy : తాడిపత్రిలో 30 ఏళ్లుగా కొనసాగుతున్న జేసీ కుటుంబ పాలనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు,…
Medaram Jatara 2026 : మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరకు రోజులు దగ్గర పడుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా…
Chinmayi : ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద సోషల్ మీడియా వేదికగా సామాజిక అంశాలపై తరచూ తన…
T20 World Cup 2026 : ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 కోసం…
Gold Rates | ఇటీవల వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. శనివారం నాటికి 10…
Bananas : అరటిపండును 'ప్రకృతి ప్రసాదించిన శక్తి బాంబు' ( Energy Bomb ) అని పిలవవచ్చు. తక్కువ ధరలో…
SBI : దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), వినియోగదారులకు షాక్…
Virat Kohli : ఇటీవల ఫామ్ కోల్పోయాడంటూ విమర్శలు ఎదుర్కొన్న స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ, ఏడాది ముగిసే సరికి…
This website uses cookies.