7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది. అసలే కొత్త సంవత్సరం రాబోతోంది. దీంతో ఉద్యోగులకు మూడు గిఫ్ట్ లను అందించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే 18 నెలల డీఏ బకాయిల కోసం ఉద్యోగులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. అలాగే.. ఫిట్ మెంట్ పెంపు, డీఏ పెంపుపై కూడా ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. కొత్త సంవత్సరంలో ఈ మూడు డిమాండ్లను కేంద్రం పరిష్కరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. జనవరి 2020 నుంచి జూన్ 2021 వరకు డీఏ బకాయిలను కేంద్రం ఇప్పటి వరకు ఉద్యోగులకు చెల్లించలేదు.
డీఏ బకాయిలు 18 నెలల ఒకేసారి ఉద్యోగుల అకౌంట్లలో వేసే అవకాశం ఉంది. కేంద్ర కేబినేట్ ఇంకా డీఏ బకాయిలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే.. మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. లేవల్ 3 ఉద్యోగుల డీఏ బకాయిలు కనీసం రూ.11,880 నుంచి రూ.37,554 వరకు వచ్చే అవకాశం ఉంది. లేవల్ 13, లేవల్ 14 ఉద్యోగులకు కనీసం రూ.1,44,200 నుంచి రూ.2,15,900 వరకు డీఏ బకాయిలు వచ్చే అవకాశం ఉంది. అలాగే.. ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ పెంపుపై కూడా కేంద్రం త్వరలో నిర్ణయం తీసుకోనుందట. వచ్చే కేంద్ర బడ్జెట్ తర్వాత ఫిట్ మెంట్ పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఒకవేళ ప్రభుత్వం ఫిట్ మెంట్ ను 3 టైమ్స్ పెంచితే అలవెన్సెలు కాకుండానే ఒక ఉద్యోగి బేసిక్ వేతనం రూ.46,260 కానుంది. ఉద్యోగుల డిమాండ్ ను పరిగణనలోకి తీసుకుంటే.. 3.68 ఫిట్ మెంట్ ఇస్తే జీతం ఇంకాస్త పెరిగే అవకాశం ఉంది. 3 టైమ్స్ ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ పెరిగినా కూడా జీతం పెరుగుతుంది. అలాగే.. డీఏ పెంపుపై వచ్చే మార్చిలో కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్బణం రేట్లను పరిగణనలోకి తీసుకొని 3 నుంచి 5 శాతం డీఏను కేంద్రం పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే 4 శాతం డీఏను 28 సెప్టెంబర్ 2022న పెంచిన విషయం తెలిసిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.