7th Pay Commission : రైల్వే ఉద్యోగుల‌కి గుడ్ న్యూస్.. జీతాల‌లో భారీగా పెంపు…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

7th Pay Commission : రైల్వే ఉద్యోగుల‌కి గుడ్ న్యూస్.. జీతాల‌లో భారీగా పెంపు…?

7th Pay Commission : కేంద్ర ప్ర‌భుత్వం ఉద్యోగుల‌కి గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల 7వ వేతన సంఘం సూచనల మేరకు డియర్‌నెస్ అలవెన్స్ , డియర్‌నెస్ రిలీఫ్ లను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ, డీఆర్‌లను 3 శాతం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ), పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ (డీఆర్) అడిషనల్‌ ఇన్‌స్టాల్‌మెంట్లను అందించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర […]

 Authored By sandeep | The Telugu News | Updated on :7 April 2022,6:00 pm

7th Pay Commission : కేంద్ర ప్ర‌భుత్వం ఉద్యోగుల‌కి గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల 7వ వేతన సంఘం సూచనల మేరకు డియర్‌నెస్ అలవెన్స్ , డియర్‌నెస్ రిలీఫ్ లను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ, డీఆర్‌లను 3 శాతం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ), పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ (డీఆర్) అడిషనల్‌ ఇన్‌స్టాల్‌మెంట్లను అందించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2022 జనవరి 1వ తేదీ నుంచి బేసిక్ పే/పెన్షన్‌లో ప్రస్తుతం ఉన్న 31 శాతం రేటు కంటే 3 శాతం పెరుగుదల అమలవుతుంది అని పేర్కొంది. ఈ క్ర‌మంలో రైల్వే కార్మికుల జీతం పెరగనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

వాస్తవానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్‌ను పెంచిన తర్వాత రైల్వే మంత్రిత్వ శాఖ కూడా ఈ భత్యాన్ని చెల్లించాలని అన్ని జోన్లకి ఆదేశాలు జారీచేసింది. దీనిప్రకారం.. సవరించిన రేట్లతో డియర్‌నెస్ అలవెన్స్ చెల్లిస్తారు. రైల్వేశాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో దాదాపు 14 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు నేరుగా లబ్ధి పొందనున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెలాఖరులోగా ఈ చెల్లింపులు జరుగుతాయి. రైల్వే బోర్డు డిప్యూటీ డైరెక్టర్ జై కుమార్ ఈ మేరకు అన్ని జోన్లు, ఉత్పత్తి యూనిట్లకు లేఖ జారీ చేశారు. ఇందులో ‘రైల్వే ఉద్యోగులకు చెల్లించాల్సిన డియర్‌నెస్ అలవెన్స్‌ను జనవరి 1, 2022 నుంచి అమలులోకి వచ్చేలా బేసిక్ పేలో ప్రస్తుతం ఉన్న 31% నుంచి 34%కి పెంచుతామనిపేర్కొన్నారు.

7th Pay Commission Railways Employees Likely to Get Hike in DA Soon

7th Pay Commission Railways Employees Likely to Get Hike in DA Soon

7th Pay Commission : గుడ్ న్యూస్…

ఏప్రిల్ 30న బకాయిలతో పాటు డియర్‌నెస్ అలవెన్స్ కూడా చెల్లిస్తామని గోపాల్ మిశ్రా తెలిపారు. 7వ వేతన సంఘం సిఫార్సులు ఆధారంగా డీఏ అమలు జనవరి 1, 2022 అమల్లోకి రానుంది. ధరల పెరుగుదల నేపథ్యంలో బేసిక్‌ పే/పెన్షన్‌కు అదనంగా 3 శాతం డీఏ పెంపును వేతన సంఘం సిఫార్సు చేసింది. తాజా నిర్ణ‌యంతో రైల్వే ఉద్యోగులు తాజా నిర్ణ‌యం సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది