మా అమ్మ కు వ‌రుడు కావ‌లెను.. వైరల్ అవుతున్న ఓ అమ్మాయి ట్వీట్ !! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

మా అమ్మ కు వ‌రుడు కావ‌లెను.. వైరల్ అవుతున్న ఓ అమ్మాయి ట్వీట్ !!

ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా ప్రతిదీ క్షణాల్లో వైరల్ అవుతుంది. అందులో కొన్ని మనల్ని నవ్వింప చేసేలా ఉంటే, మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఇంకా మరికొన్ని ఆలోచింపజేసేలా ఉంటాయి. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ అమ్మాయి చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. సాధారణంగా తల్లిదండ్రులు పిల్లలకు పెళ్లి సంబంధాలు చూస్తారు. అయితే ఆస్తా వర్మ మాత్రం అందుకు భిన్నంగా తన తల్లి కోసం వరుడిని వెతకడం ప్రారంభించింది. తాను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే తన […]

 Authored By aruna | The Telugu News | Updated on :19 July 2023,6:00 pm

ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా ప్రతిదీ క్షణాల్లో వైరల్ అవుతుంది. అందులో కొన్ని మనల్ని నవ్వింప చేసేలా ఉంటే, మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఇంకా మరికొన్ని ఆలోచింపజేసేలా ఉంటాయి. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ అమ్మాయి చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. సాధారణంగా తల్లిదండ్రులు పిల్లలకు పెళ్లి సంబంధాలు చూస్తారు. అయితే ఆస్తా వర్మ మాత్రం అందుకు భిన్నంగా తన తల్లి కోసం వరుడిని వెతకడం ప్రారంభించింది. తాను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే తన తల్లి ఒంటరి అవుతుందని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఆస్తా వర్మ తన చిన్నప్పుడే తన తండ్రిని కోల్పోయింది. దీంతో ఒంటరిగానే తన తల్లి కూతురిని ఉన్నంతలో పెంచింది. ఇక ఆడపిల్ల అన్నాకా పెళ్లి చేసుకొని వేరే ఇంటికి వెళ్లక తప్పదు. ఈ క్రమంలోనే ఆస్తావర్మ తనకి పెళ్లి అయిపోయి వేరే ఇంటికి వెళితే తన తల్లి ఒంటరి అవుతుందని, అందుకే తన తల్లికి తోడుగా ఎవరైనా ఉంటే బాగుండు అని ఆలోచన చేసింది. అందుకోసం తన తల్లి కోసం వరుడిని వెతకడం ప్రారంభించింది. అందుకు సోషల్ మీడియాను వేదికగా ఎంచుకుంది. మా అమ్మ కోసం 50 ఏళ్ల వరుడు కావాలి. అతడు వెజిటేరియన్ అయ్యి ఉండాలి. తాగుడు అలవాటు ఉండకూడదు.

A daughter looking for a groom for her mother

A daughter looking for a groom for her mother

అంతేకాదు అతడు జీవితంలో మంచిగా సెటిలై ఉండాలి అంటూ ఆస్తా వర్మ తన సోషల్ మీడియా ఎకౌంట్లో తన తల్లితో ఉన్న సెల్ఫీనీ ట్రీట్ చేసింది. ఈ ట్వీట్ పై నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందించారు. మీ అమ్మ గురించి మీరు ఇంతలా ఆలోచిస్తున్నారు. మీరు నిజంగా గ్రేట్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ రోజుల్లో తల్లిదండ్రులు పట్టించుకోవడం మానేశారు అలాంటిది మీరు మీ అమ్మ కోసం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అభినందనీయం అంటూ మరొకరు కామెంట్ చేసారు. దీంతో సోషల్ మీడియాలో ఆస్తా వర్మ చేసిన ట్వీట్ తెగవైరల్ అవుతుంది.

Tags :

    aruna

    ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది