Viral News : ఒకే నెలలో మూడు సార్లు చచ్చిపోయి మళ్ళీ బతికిన మహిళ.. ఆత్మ ఎవరెవరిని కలిసింది అంటే..!!
Viral News : ఈ ప్రపంచంలో ప్రతి మనిషి జీవితంలో జన్మించడం, మరణించడం ఒక్కసారే జరుగుతుంది. అయితే చచ్చిపోయి మళ్ళీ బతకడం అనేది అసాధ్యం. చనిపోయేంత పరిస్థితి దాక వెళ్లి బతికి బయటపడ్డ సంఘటనలు మనిషి జీవితంలో ఉండొచ్చేమో గాని.. చనిపోయి మళ్లీ బతికిన మనుషుల దాఖలాలు లేవు. అటువంటిది ఓ మహిళ తాను ఒకే నెలలో మూడుసార్లు మరణించినట్లు ఇటీవల తెలియజేసింది. ఈ క్రమంలో మూడుసార్లు అనేసరికి అందరికీ డౌట్ రావటం సర్వ సాధారణ. మొదటిసారి చనిపోయి తన ఆత్మ కొంతమంది ప్రముఖులను కలిశాక మళ్ళీ శరీరంలోకి రావడం జరిగింది అంట.
ఆ రకంగా ఆ మహిళ మూడుసార్లు చనిపోయి తిరిగి లేచి మళ్లీ ఇప్పుడు సజీవంగా ఉంది. అయితే ఆమె మూడుసార్లు చనిపోయిన సమయంలో తన ఆత్మ దేవుడితోపాటు కొంతమంది ప్రముఖులను.. చనిపోయిన కన్న తండ్రిని కూడా కలిసినట్లు తెలిపింది. పూర్తి వివరాల్లోకి వెళితే ఇంగ్లాండ్‌లోని బిర్కెన్‌హెడ్‌కు చెందిన 57 ఏళ్ల బీవెర్లీ గిల్‌మర్ చెప్పిన దాని ప్రకారం.. ఆమెకు 20 ఏళ్లు ఉన్నపుడు బ్రెయిన్ ట్రోమా వచ్చింది. దీంతో ఆమె చనిపోయిన అనుభవాన్ని పొందింది.
శరీరం పనిచేయకుండా పోవడం గుండె ఆగిపోవడం ఆ తర్వాత.. శరీరం నుండి ఆత్మ వెళ్ళిపోవడం వంటి అనుభవం ఉన్న తాను వెళ్లినట్లు బీవెర్లీ.. ఇలా మూడుసార్లు.. తన ఆత్మ ప్రముఖులతో మాట్లాడటం జరిగిందని జీసస్ క్రైస్ట్ తో స్నేహం కూడా చేసినట్లు ఇదంతా ఒక నెలలోనే జరిగినట్లు తాజాగా చెప్పుకొచ్చింది.