చాలా సినిమాలలో హీరో హీరోయిన్లు ప్రేమించుకొని ఆ తర్వాత పెద్దలు ఒప్పుకోకపోతే హీరో హీరోయిన్ లు సీక్రెట్ గా పెళ్లి చేసుకోవడం చూస్తూ ఉంటాం. హీరో హీరోయిన్ ని ఎత్తుకెళ్లి సీక్రెట్ గా పెళ్లి చేసుకుంటాడు. ఇది సినిమాలలో జరిగేది. కానీ రియల్ లైఫ్ లో జరిగిన ఈ సంఘటన లో అమ్మాయి అబ్బాయిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకుంది. ఈ ఘటన తమిళనాడులోని చెన్నైలో జరిగింది.చెన్నై వేళచ్చేరికి చెందిన ఐటీ ఉద్యోగి పార్తిబన్, రాణిపేటకు చెందిన సౌందర్య కాలేజీ రోజుల్లో ప్రేమించుకున్నారు. చెట్టాపట్టాలేసుకొని సినిమాలకు, షికార్లకు తిరిగారు. ఏడేళ్ల ప్రేమ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి.
దీంతో తమ లవ్‌కు బ్రేకప్ చెప్పారు. చాలా కాలం ఇద్దరు దూరంగా ఉన్నారు. అయితే లవ్ బ్రేకప్ అయింది కదా అని కొన్నాళ్లకు పార్దిబన్ మరో పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యాడు. ఐటి ఉద్యోగం చేసే మరో యువతని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సౌందర్య పార్దిబన్ ను మరిచిపోలేకపోయింది. అతడినే పెళ్లి చేసుకుంటానని తన తల్లి బంధువులతో తెగేసి చెప్పేసింది. దీంతో ఆమె తల్లి తన బంధువులైన శివకుమార్, రమేష్ సహాయంతో అతడిని కిడ్నాప్ చేశారు. ఆగస్టు 11న ఎప్పటిలాగే ఆఫీస్ కు బయలుదేరిన పార్దిబన్ ను కారులో వచ్చి కిడ్నాప్ చేశారు.
నేరుగా కాంచీపురం లోని ఓ గుడికి తీసుకువెళ్లి బలవంతంగా సౌందర్య మెడలో తాళి కట్టించారు. ఈ విషయం తెలుసుకున్న పార్దిబన్ భార్య పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించారు. సౌందర్య తో పాటు యువకుడి కిడ్నాప్ సహకరించిన ఆమె బంధువులను కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే సౌందర్య పెళ్లి చెల్లదని తేల్చి చెప్పేశారు. ఆల్రెడీ పెళ్లయిన వ్యక్తిని బలవంతంగా పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదని సౌందర్యకు తెలిపారు. ఏది ఏమైనా సౌందర్య చేసిన పనికి అందరూ షాక్ అవుతున్నారు వారి ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.