పెళ్ళైన వ్యక్తిని కిడ్నాప్ చేసి మరీ .. బలవంతంగా పెళ్లి చేసుకున్న మాజీ లవర్ ..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

పెళ్ళైన వ్యక్తిని కిడ్నాప్ చేసి మరీ .. బలవంతంగా పెళ్లి చేసుకున్న మాజీ లవర్ ..!!

 Authored By aruna | The Telugu News | Updated on :13 August 2023,1:30 pm

చాలా సినిమాలలో హీరో హీరోయిన్లు ప్రేమించుకొని ఆ తర్వాత పెద్దలు ఒప్పుకోకపోతే హీరో హీరోయిన్ లు సీక్రెట్ గా పెళ్లి చేసుకోవడం చూస్తూ ఉంటాం. హీరో హీరోయిన్ ని ఎత్తుకెళ్లి సీక్రెట్ గా పెళ్లి చేసుకుంటాడు. ఇది సినిమాలలో జరిగేది. కానీ రియల్ లైఫ్ లో జరిగిన ఈ సంఘటన లో అమ్మాయి అబ్బాయిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకుంది. ఈ ఘటన తమిళనాడులోని చెన్నైలో జరిగింది.చెన్నై వేళచ్చేరికి చెందిన ఐటీ ఉద్యోగి పార్తిబన్‌, రాణిపేటకు చెందిన సౌందర్య కాలేజీ రోజుల్లో ప్రేమించుకున్నారు. చెట్టాపట్టాలేసుకొని సినిమాలకు, షికార్లకు తిరిగారు. ఏడేళ్ల ప్రేమ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి.

దీంతో తమ లవ్‌కు బ్రేకప్ చెప్పారు. చాలా కాలం ఇద్దరు దూరంగా ఉన్నారు. అయితే లవ్ బ్రేకప్ అయింది కదా అని కొన్నాళ్లకు పార్దిబన్ మరో పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యాడు. ఐటి ఉద్యోగం చేసే మరో యువతని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సౌందర్య పార్దిబన్ ను మరిచిపోలేకపోయింది. అతడినే పెళ్లి చేసుకుంటానని తన తల్లి బంధువులతో తెగేసి చెప్పేసింది. దీంతో ఆమె తల్లి తన బంధువులైన శివకుమార్, రమేష్ సహాయంతో అతడిని కిడ్నాప్ చేశారు. ఆగస్టు 11న ఎప్పటిలాగే ఆఫీస్ కు బయలుదేరిన పార్దిబన్ ను కారులో వచ్చి కిడ్నాప్ చేశారు.

a women kidnapped a married man and marry him

a women kidnapped a married man and marry him

నేరుగా కాంచీపురం లోని ఓ గుడికి తీసుకువెళ్లి బలవంతంగా సౌందర్య మెడలో తాళి కట్టించారు. ఈ విషయం తెలుసుకున్న పార్దిబన్ భార్య పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించారు. సౌందర్య తో పాటు యువకుడి కిడ్నాప్ సహకరించిన ఆమె బంధువులను కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే సౌందర్య పెళ్లి చెల్లదని తేల్చి చెప్పేశారు. ఆల్రెడీ పెళ్లయిన వ్యక్తిని బలవంతంగా పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదని సౌందర్యకు తెలిపారు. ఏది ఏమైనా సౌందర్య చేసిన పనికి అందరూ షాక్ అవుతున్నారు వారి ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది