Home » Devotional » Bairi Naresh Comments On Yerravaram Bala Ugra Narasimha Swamy Temple 2
Devotional

Bairi Naresh : ఎర్రవరం లో వెలసిన బాలఉగ్రనరసింహస్వామి పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన బైరి నరేష్ ..!!

Authored By
aruna
The Telugu News | Published on: August 13, 2023, 12:00 pm
Advertisement

Bairi Naresh : తెలంగాణలోని ఎర్రవరం లక్ష్మీనరసింహస్వామి ఆలయం గురించి పెద్ద చర్చ నడుస్తుంది. ఎర్రవరం లోని ఒక గుట్టపై బాల ఉగ్ర నరసింహ స్వామి వెలిశాడని, ఆ ఆలయానికి వెళ్లి ఏం కోరుకుంటే అది జరుగుతుందని అక్కడి భక్తులు నమ్ముతున్నారు. అలాగే అక్కడ ఒక బాలుడు పై ఉగ్ర నరసింహ స్వామి పూనడంతో అతడు ఏం చెబితే అది జరుగుతుందని చెబుతున్నారు. ఆ బాలుడు అక్కడ పుట్టపైన బాల ఉగ్ర నరసింహ స్వామి వెలిశాడని చెప్పడంతో ఆ ఊరి ప్రజలంతా అక్కడికి వెళ్లి చూశారు. నిజంగానే గుట్టపై దేవుడు వెలిశాడని ప్రజలు పూజలు చేయడం ప్రారంభించారు.

Advertisement

అలాగే చాలామంది తమ కోరికలు నెరవేరాయని కూడా చెప్పారు. అక్కడికి వెళ్ళి ఏం కోరుకుంటే అది జరుగుతుందని చెబుతుండడంతో అది కాస్త వైరల్ అయింది. దీంతో చుట్టూ ప్రక్కల గ్రామాల ప్రజలే కాదు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు బాల ఉగ్ర నరసింహ స్వామిని దర్శించుకోవడానికి వెళుతున్నారు. లక్షల సంఖ్యలో ప్రతిరోజు భక్తులు దర్శనం ఇస్తున్నారు. ప్రతి శుక్రవారం చాలా రద్దీగా ఉంటుంది. అయితే ఆ గుడిపై ప్రముఖ నాస్తికుడు బైరి నరేష్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అసలు అక్కడ దేవుడు అనేది లేదన్నారు. బాల ఉగ్ర నరసింహ స్వామి అనేది అంత బూటకం అన్నారు.

Bairi Naresh Comments On Yerravaram Bala Ugra Narasimha Swamy Temple

Advertisement

అక్కడికి వెళ్లి ప్రెగ్నెంట్ కావాలని కోరుకుంటే అది నిజం అవుతుందా. వినడానికి నవ్వు వస్తుంది. భర్తతో కాపురం చేస్తే వస్తుందా లేక ఆ బాలుడు చెప్పాడని ప్రెగ్నెంట్ రావడం ఏంటి అని ప్రశ్నించారు. అలాగే ఇంకా చాలామంది ఈ గుడికి వచ్చాక నాకు క్యాన్సర్ తగ్గిపోయిందనీ, నాపై ఉన్న కేసులు అన్ని తొలగిపోయానని చెప్పడం చాలా ఫన్నీగా ఉంది. మీరు ఎప్పటినుంచో ఆ కేసు గురించి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఇప్పుడు సాల్వ్ అయింది అంతేకానీ దేవుడే చేయలేదు అని అన్నారు. వంద ఛానళ్లు ఆ ఉగ్ర నరసింహ స్వామి గురించి చెప్పారు కానీ తెర వెనుక అసలు ఏం జరుగుతుందో చెప్పరు. ఎందుకంటే ఆ ఊరి ప్రజలు తరిమేస్తారు కాబట్టి అంటూ బైరినరేష్ కామెంట్స్ చేశారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి