AARAA Survey : ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు పెడితే ఏ పార్టీ గెలుస్తుంది? ఆరా సర్వేలో ఏం తేలిందో తెలిస్తే షాక్ అవుతారు?
AARAA Survey : ప్రస్తుతం తెలంగాణలోని రాజకీయ పార్టీలు అన్నీ ఎన్నికల మీద ఫోకస్ పెట్టాయి. ముందస్తు ఎన్నికలు కావాలంటే తేదీ చెప్పండి..నేను వెంటనే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వస్తా అని బీజేపీకి టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. టీఆర్ఎస్ పార్టీ కూడా పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే ముందస్తు ఎన్నికలను నిర్వహించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. 2019 జనరల్ ఎన్నికల కంటే ముందే 2018 లోనే టీఆర్ఎస్ పార్టీ ముందస్తుకు వెళ్లి విజయం సాధించింది.
ఈసారి కూడా అదే అజెండాతో ముందుకు వెళ్లాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈనేపథ్యంలో అసలు తెలంగాణలో ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగినా.. ముందస్తు ఎన్నికలు జరిగినా ఏ పార్టీ గెలుస్తుంది అనే దానిపై ఆరా అనే ఓ సర్వే సంస్థ సర్వే నిర్వహించింది. తాజాగా ఆ సర్వే ఫలితాలను వెల్లడించింది. గత సంవత్సరం నవంబర్ లో.. ఈ సంవత్సరం మార్చి, జులై నెలలో మూడు సార్లు ఆరా సంస్థ తెలంగాణలో సర్వే నిర్వహించింది. ఆ సర్వే ప్రకారం.. ఈసారి జరగబోయే ఎన్నికల్లో గెలిచేది టీఆర్ఎస్ పార్టీనే అని కుండబద్దలు కొట్టేసింది. వాళ్ల సర్వే ప్రకారం.. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి 38.88 శాతం ఓట్లు వస్తాయట.

aaraa survey reveals that trs will again win in trs in next elections
AARAA Survey : మళ్లీ అధికారంలోకి వచ్చేది ఏ పార్టీనే ముందే చెప్పేసిన సంస్థ
బీజేపీకి 30.48 శాతం ఓట్లు వచ్చి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అవతరిస్తుందట. కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి పరిమితం అవుతుందట. కాంగ్రెస్ పార్టీకి 23,71 శాతం ఓట్లు వస్తాయట. తెలంగాణలో 119 నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో 87 స్థానాల్లో ఖచ్చితంగా టీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందని సర్వే వెల్లడించింది. అయితే.. 2018 తో పోల్చితే ఈసారి టీఆర్ఎస్ పార్టీకి తక్కువ శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని సంస్థ వెల్లడించింది. 2018 లో టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం 46.87. కానీ.. ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే 38.88 శాతం ఓట్లు రానున్నాయట. అయితే.. ఈ సారి బీజేపీ బాగా పుంజుకోనుంది. మూడో స్థానంలో ఉన్న బీజేపీ రెండో స్థానానికి ఎగబాకి కాంగ్రెస్ ను మూడో స్థానానికి నెట్టేయనుంది.