Accenture | విశాఖకు రానున్న అంతర్జాతీయ ఐటీ దిగ్గజం .. 12 వేల మందికి ఉద్యోగాలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Accenture | విశాఖకు రానున్న అంతర్జాతీయ ఐటీ దిగ్గజం .. 12 వేల మందికి ఉద్యోగాలు

 Authored By sandeep | The Telugu News | Updated on :24 September 2025,4:00 pm

Accenture | ఏపీలో ఐటీ హబ్‌గా ఎదుగుతున్న విశాఖపట్నం తీరానికి మరో అంతర్జాతీయ టెక్ దిగ్గజం రానుంది. ఇక్క‌డ‌ భారీ క్యాంపస్ ఏర్పాటు చేసి, సుమారు 12,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించాలని యోచిస్తుంద‌ట‌. పది ఎకరాల భూమిని ఎకరా 99 పైసల నామమాత్రపు లీజుకు కేటాయించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకంద‌ట‌.

#image_title

మ‌రో కంపెనీ..

ప్రపంచవ్యాప్తంగా 7.9 లక్షల మంది ఉద్యోగులతో కార్యకలాపాలు సాగిస్తున్న యాక్సెంచర్‌లో దాదాపు మూడు లక్షల మంది భారతీయులే పనిచేస్తున్నారు. ఇంతటి భారీ సంస్థ విశాఖకు వస్తే స్థానికంగా ఉద్యోగ అవకాశాలు పెరగడంతో పాటు అనుబంధ రంగాల అభివృద్ధి కూడా వేగవంతమవుతుందని ఐటీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటికే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) రూ. 1,370 కోట్ల పెట్టుబడితో 12 వేల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించింది. ఈ సంస్థకు ఐటీ హిల్ నంబరు-3లో 21.6 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. అదేవిధంగా, మరో టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ కూడా కాపులుప్పాడలో తమ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనుంది. కొవిడ్ మహమ్మారి తర్వాత ఐటీ కంపెనీలు బెంగళూరు, హైదరాబాద్ వంటి మెట్రో నగరాలకు బదులుగా విశాఖ వంటి ద్వితీయ శ్రేణి నగరాలపై దృష్టి సారిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఐటీ పాలసీ బడా కంపెనీలను విశేషంగా ఆకర్షిస్తోంది

Tags :

    sandeep

    ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది