Ram Charan: తాను రిచ్ ఏం కాదన్న రామ్ చరణ్.. డబ్బులు లేకే సినిమాల్లో నటిస్తున్నానన్న మెగా తనయడు..!

Authored By Breaking News 2 | The Telugu News | Updated on: December 29, 2021, 3:46 pm

Ram Charan: రాజమౌళి దర్శకత్వంలో తారక్ , రామ్ చరణ్ హీరోలుగా మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ఆర్ ఆర్ ఆర్ విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సినిమా ప్రమోషన్స్‌ను జోరుగా నిర్వహిస్తోంది. విరామం అనేదే లేకుండా అన్ని భాషల్లోనూ కార్యక్రమాలకు హాజరు అవుతోంది. ఈ క్రమంలో బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టిన ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్ తాజాగా ది కపిల్‌ శర్మ షోలో పాల్గొని సందడి చేసింది. వ్యాఖ్యాత కపిల్‌ శర్మ అడిగిన పలు ప్రశ్నలకు నటుడు రామ్ చరణ్ ఇచ్చిన సమాధానాలు నెట్టింట వైరల్ గా మారాయి.

Actor Ram Charan Comments Aeroplane Company Rumours on Him

Actor Ram Charan Comments Aeroplane Company Rumours on Him

అంత డబ్బే ఉంటే సినిమాలెందుకు..!

వ్యాఖ్యాత కపిల్ నటుడు రామ్‌చరణ్‌ పై వచ్చే పలు రూమర్స్ పై ఆయనను స్పందించాల్సిందిగా కోరారు. మీకు ఏరోప్లేన్ కంపెనీ, హోటళ్లు, ఆసుపత్రులు ఇలా చాలా వ్యాపారాలు ఉన్నాయంట కదా.. అంత డబ్బుండి హాయిగా రెస్ట్ తీసుకోకుండా..ఎందుకిలా సినిమాలు, ప్రమోషన్‌లు అంటూ పరుగులు పెడుతున్నారని చెర్రీని కపిల్ ప్రశ్నించాడు. అందుకు బదులుగా రామ్ చరణ్ నుంచి ఊహించని సమాధానాలు వచ్చాయి. తాను శ్రీమంతుడ్ని కాదన్న రామ్‌చరణ్‌, నవ్వుతూ తనకే ఫ్లైట్ల కంపెనీ లేదన్నాడు. అంత డబ్బు ఉంటే తను ఇంట్లోనే కూర్చొనే వాడినని బదులిచ్చాడు. డబ్బులు లేవు కాబట్టే సినిమాల్లో నటిస్తున్నానంటూ చెప్పుకొచ్చాడు ఈ మెగాస్టార్ తనయుడు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిరుత సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి మొదట్లో ఫ్లాప్ లను ఎదుర్కొన్నాడు. అనంతరం రాజమౌళి దర్శకత్వంలో మొదటిసారిగా మగధీర సినిమాతో స్టార్ హీరో హోదాను దక్కించుకున్నారు. ప్రస్తుతం అదే జక్కన్న దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ ఒకానొక హీరోగా నటిస్తున్నారు. స్వాతంత్ర్య సమర యోధుల నేపథ్యంగా అత్యంత భారీ ఎత్తున విడుదల కానున్న ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. వీటికి అనుగుణంగానే చిత్ర బృందం దేశ వ్యాప్తంగా సినిమా ప్రమోషన్స్‌తో సందడి చేస్తున్నారు.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp