Ys Jagan : మరో పదేళ్ల పాటు వైయస్ జగన్ సీఎంగా ఉంటే రాష్ట్రం స్వర్ణాంద్ర అవుతుంది
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ చూడనంత అభివృద్ధిని ఈ మూడు సంవత్సరాల్లో చూసిందని.. అందుకే మరో రెండు సార్లు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏపీకి సీఎం అయితే కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారుతుంది అంటూ సినీ నటుడు మరియు సామాజిక వేత్త అయిన హీరో సుమన్ వ్యాఖ్యలు చేశారు. తాజాగా విజయవాడలోని ఆటో నగర్ లో ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సీఎం జగన్ మోహన్ రెడ్డి పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు మరియు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూస్తుంటే ఆశ్చర్యం గా ఉంది అంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలకు మరియు మధ్యతరగతి ప్రజలకు సీఎం జగన్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి తాను గతంలో పలు సందర్భాల్లో తెలుసుకుని ఆశ్చర్యపోయాను అన్నారు. ఇదే తరహాలో మరో పదేళ్ల పాటు వైఎస్ జగన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలుస్తుంది అంటూ ఆయన ధీమా వ్యక్తం చేశాడు.రాష్ట్రం విడిపోయిన తర్వాత కొన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా ఎదురొడ్డి నిలిచిన రాష్ట్ర ప్రజలకు అభినందనలు తెలియజేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి వంటి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని
ఆయన తీసుకునే నిర్ణయాలు పేదలకు మరియు ప్రతి ఒక్కరికి సంక్షేమ కలిగిస్తున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి తో పోలిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా అయిన తర్వాత జరుగుతున్న అభివృద్ధి డబల్ అన్నట్లుగా ఇప్పటికే జనాలు నమ్ముతున్నారు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అందుకు నిదర్శనం అన్నట్లుగా ఉన్నాయంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో వైకాపాకు మంచి పేరు గుర్తింపు దక్కింది కనుక వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా వైకాపా విజయం సాధిస్తుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.