
#image_title
ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడాభివృద్ధిని క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక కార్యక్రమం చేపట్టింది. ఆడుదాం ఆంధ్ర రాష్ట్ర వ్యాప్త క్రీడా టోర్నమెంట్ల వీడియో లాంచ్ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తో కలిసి క్రీడా శాఖ మంత్రి రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోజే మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమాన్ని ఏ ముఖ్యమంత్రి తీసుకురాలేదు ప్రస్తుతం యువతలో ఫిజికల్ ఫిట్నెస్ సరిగా ఉండటం లేదన్నారు ఆడుదాం ఆంధ్ర యువతకు మంచి అవకాశం అని తెలిపారు టోర్నమెంట్లో 12 కోట్ల ప్రైస్ మనీ అందిస్తామని మంత్రి రోజా తెలిపారు. అలాగే 100 కోట్ల బడ్జెట్ తో ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని రోజా తెలిపారు టోర్నమెంట్లో పాల్గొనేందుకు 72 గంటల్లో ఐదు లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆమె అన్నారు.
ఇంత మంచి అవకాశం మళ్ళీ వస్తుందో లేదో ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు కోటి మంది వరకు రిజిస్ట్రేషన్ చేసుకుంటారని భావిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఏపీ ఆటల ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలని వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి లక్షణం మంత్రి రోజా చెప్పారు ఆడపిల్లలు కూడా ఉత్సాహంగా పాల్గొనాలని రోజా పిలుపునిచ్చారు ఈ సందర్భంగా షాప్ చైర్మన్ సిద్ధార్థ మాట్లాడుతూ రాజకీయ నాయకులు ఎన్నికల అప్పుడే వస్తారని అభిప్రాయం ప్రజల్లో ఉండేది అన్నారు సీఎం వైఎస్ జగన్ ఏపీలో ఒక ట్రెండును సృష్టించారు అని అన్నారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రతి నాయకుడిని నిత్యం జనాల్లో ఉండేలా జగన్ చూస్తున్నారు ఆడుదాం ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద క్రీడా సంబరం అని ఆయన పేర్కొన్నారు గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యమని వివరించారు యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు.
ఈ పోటీలకు సచివాలయాల్లో కూడా రిజిస్టర్ చేసుకోవచ్చని మంత్రి రోజా తెలిపారు. అయితే హైదరాబాదులో ఓటు ఉన్నవారికి ఇక్కడ ఆటలు ఆడడం కుదరదని అన్నారు. ఓటుకు నోటు కేసులో దొంగలా పారిపోయి వచ్చిన చంద్రబాబును ఎవరు అడగగలరు ఆమె విమర్శించారు. పర్మనెంట్ ఉద్యోగాలు గతంలో ఎప్పుడూ లేవని, అకాడమీలు కట్టడం కోసమే కిడాంబి శ్రీకాంత్, పీవీ సింధులకు ల్యాండ్ ఇచ్చామన్నారు. సాకేత్‌కు కూడా ల్యాండ్ ఇస్తామని మంత్రి రోజా తెలిపారు. ఆడుదాం ఆంధ్రాలో గెలిచిన వారికి ఏం చేయాలో స్పోర్ట్స్ కోటా విషయమై ఆలోచిస్తామన్నారు. వాలంటీర్లతో పాటు పీటీలు కూడా ఉంటారని ఆమె చెప్పారు. సచివాలయం, మండల, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో క్రీడలు నిర్వహిస్తున్నామని మంత్రి ఆర్కే రోజా తెలిపారు. 50రోజుల పాటు ఈ క్రీడలు జరగనున్నాయని వెల్లడించారు.
Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
This website uses cookies.