Shraddha Walker Murder Case : దేశ రాజధాని ఢిల్లీలో శ్రద్ధావాల్కర్ హత్యకేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడు ఆఫ్తాబ్ … తన ప్రియురాలు శ్రద్ధావాల్కర్ నీ 35 ముక్కలు చేసి.. నరరూప రాక్షసుడిగా వ్యవహరించాడు. ఇదిలా ఉంటే నిందితుడు ఆఫ్తాబ్ కి పూనావాలాకు ఢిల్లీలోని రోహిణిలోగల ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో పాలీగ్రాఫ్ టెస్ట్ నిర్వహించారు. ఈ క్రమంలో అతడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. ఈ టెస్ట్ లలో శ్రద్ధానీ తానే చంపినట్లు అంగీకరించడం జరిగిందట. అయితే ఆమెను చంపినందువల్ల తానే మీ బాధపడటం లేదని ఆఫ్తాబ్ … ఈ పరీక్షల్లో.. వెల్లడించినట్లు దర్యాప్తు బృందాలు చెప్పుకొస్తున్నాయి. ఇంకా ఈ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో పాలీగ్రాఫ్ టెస్ట్‌లో …
శ్రద్ధానీ చంపిన తర్వాత ఆమె శరీర భాగాలు.. ముక్కలు ముక్కలుగా నరికినట్లు అడవిలో పడేసినట్లు కూడా ఆఫ్తాబ్ ఒప్పుకోవటం జరిగిందట. ఒక్క శ్రద్ధాతో మాత్రమే కాదు ఇంకా తనకి చాలా మంది అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయని నిందితుడు అంగీకరించినట్లు సదరు వర్గాలు తెలియజేస్తున్నాయి. పాలీగ్రాఫ్ టెస్ట్‌లో…ఆఫ్తాబ్ చాలా సాధారణంగా మాట్లాడటం జరిగిందట. ఈ హత్యకు సంబంధించి అన్ని విషయాలు పోలీసులకు తెలియజేసినట్లు ఈ విచారణలో పదే పదే చెప్పటం జరిగింది అంట. ఒక పోలీసులకు మాత్రమే కాదు ఆ మధ్య కోర్టు ముందు కూడా అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే ఆఫ్తాబ్ కి పాలీగ్రాఫ్ టెస్ట్ అనంతరం నార్కో పరీక్షలు జరిపించడానికి పోలీసులు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో నార్కో పరీక్షల కోసం… పోలీసులకు కోర్టు అనుమతులు కూడా ఇవ్వటం జరిగింది అంట.
డిసెంబర్ 1 మరియు 5వ తారీఖులలో ఢిల్లీలోని రోహిణి ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ లో… ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. దీంతో పాలీగ్రాఫ్, నార్కో పరీక్షలలో నిందితుడు ఇచ్చే వాంగ్మూలాన్ని ప్రధాన సాక్షాలుగా.. తీసుకోకుండా వాటిని కేవలం ఆధారాలుగా మాత్రమే పరిగణించనున్నారు. మరోపక్క శ్రద్ధ డిఎన్ఏ పరీక్షకు సంబంధించిన నివేదికలు రావాల్సి ఉంది. ఇవన్నీ ఓ కొలిక్కి వచ్చాక.. ఈ హత్య కేసు అసలు విషయాలు మొత్తం బయటపడనున్నాయి. శ్రద్ధ తండ్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నవంబర్ 12 వ తారీఖున ఆఫ్తాబ్ నీ అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా ప్రియురాలు శ్రద్ధనీ చంపి ఆమె దేహాన్ని 35 ముక్కలుగా నరికి.. పలు ప్రాంతాల్లో ఆఫ్తాబ్ విసేరిసినట్లు విచారంలో చెప్పడం యావత్ దేశాని దిగ్భ్రాంతికి గురి చేసింది.
Karthika Pournami : హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో కార్తీక పౌర్ణమి ఒకటి. పౌర్ణమి రోజున చంద్రుడు పూర్తి ప్రకాశంతో…
Technician Vacancies : ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, మెదక్ (OFMK) జూనియర్ మేనేజర్, డిప్లొమా టెక్నీషియన్, అసిస్టెంట్ & జూనియర్ అసిస్టెంట్…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి సంచరిస్తాయని అందరికీ తెలిసిందే. అంతేకాదు కొన్ని…
Donald Trump : ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ గెలవడం మనం చూశాం. ట్రంప్ గెలుపుపై భారత…
Rahul Gandhi : జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గానీ, ఆయన…
Castes In Telangana : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేపట్టింది. రాష్ట్రంలో అన్ని క్యాటగిరీల్లో కలిపి మొత్తం 243…
IAS Officers : పరిపాలనా పునర్వ్యవస్థీకరణలో రాష్ట్ర ప్రభుత్వం సోమవారం 13 మంది IAS అధికారులను బదిలీ చేసింది. ఉప…
Samantha : సమంత క్రేజ్ అప్పటికీ ఇప్పటికీ ఏ మాత్రం తగ్గలేదు. మయోసైటిస్ వలన కొన్నాళ్లు సినిమాలకి బ్రేక్ ఇచ్చిన…
This website uses cookies.