
will Rahul Gandhi Walkathon get Success
Rahul Gandhi : ఇటీవల వరంగల్ లో జరిగిన కాంగ్రెస్ రైతు సంఘర్షణ సభ పార్టీ కేడర్ లో ఉత్సాహాన్ని నింపింది. ఈ సభలో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులకు అండగా ఉంటామని ప్రకటించారు. టీఆర్ఎస్ రైతులను మోసం చేస్తోందిని, బీజేపీ, టీఆర్ఎస్ ఒక్కటేనని అన్నారు. తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని అధికారంలోకి రాగానే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని భరోసా ఇచ్చారు. అయితే ఈ సభ సందర్భంగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ నేతలకు సంభందించి పలు అంశాలపై చర్చించారు. పార్టీ ఆదేశాలను బేఖాతరు చేసే నేతలపై చర్యలుంటాయని హెచ్చరించారు. ఏం గొడవలున్నా పార్టీ నేతలు అంతర్గతంగా చర్చించుకోవాలని, అనవసరంగా మీడియా ముందుకు వెళ్తే చర్యలు తప్పవన్నారు.
అలాగే నేతలల్లో అభిప్రాయ బేధాలు ఉంటే చర్చించుకోవాలని అంతే కానీ పార్టీ కేడర్ ను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయోద్దని స్ట్రాంగ్ వార్నీంగ్ ఇచ్చారు.వాస్తవానికి కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే విమర్శించుకున్నారు. పలువురు నేతలు అసంతృప్తిని మీడియా వేదికగా వెళ్లగక్కారు. జగ్గారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వంటి వారు టీపీసీసీ రేవంత్ రెడ్డితో బాహాటంగానే వ్యతిరేకించారు. రీసెంట్ గా వరంగల్ సన్నాహాక సభకు సంబంధించి నల్గొండలో రేవంత్ రెడ్డి ప్లాన్ చేయగా నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇక్కడ సభ అవసరం లేదు.. మేం చూసుకుంటాం..అనడం తెలిసిందే.. అయినా కూడా రేవంత్ రెడ్డి నాగార్జున సాగర్ సన్నాహాక సభకు హాజరయ్యారు.పార్టీ వీక్ గా ఉన్న ప్రాంతాలకి వెళ్లండని.. ఇక్కడ అవసరం లేదని వెంకట్ రెడ్డి అనడంపై రేవంత్ సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది.
aicc leader Rahul Gandhi warns congress leaders about comments on media
అందుకే రాహుల్ గాంధీకి పరిస్థితి మొత్తం వివరించాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ కుమ్ములాటకలు చెక్ పెడుతూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారని పార్టీ వర్గాలో చర్చ నడుస్తోంది. అయితే కాంగ్రెస్ సీనియర్ నాయకులు మొదటి నుంచి రేవంత్ ని వ్యతిరేకించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు కలసి వచ్చే అవకాశం ఉంది.రాహుల్ గాంధీ పలువురు నాయకులకు మరో కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ ఆదేశాలను పాటించకుండా ప్రజల్లో ఉండే నాయకులకే పార్టీ టికెట్లు ఇస్తుందని.. సర్వేలు చేసి మరి ప్రజాధారణ ఉన్న నాయకులకే టికెట్లు ఇస్తామని స్పంష్టం చేశారు. ఏ పార్టీతో తెలంగాణలో పొత్తు ఉండబోదని అలా ఎవరైనా అనుకుంటే తమ దారి చూసుకోవాలని హెచ్చరించినట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ సీనియర్ నేతల వివాదాలు సద్దుమనిగినట్లేనని అంటున్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.